సంకర జాతులని పెంచి మానవ జాతి మనుగడకు ముప్పు తెస్తున్నారు!

 స్నేహితుడు:కాదు తెలివైన వాడు ఏది మన జీవనానికి ఉపయోగ పడుతుందో తెలుసుకోకుండా ఇంకొకడి ఉచ్చులో పడి వాడిని ధనవంతుడిని చేస్తున్నాడు.
నిజానికి మనిషి మీద మనిషికి నమ్మకం పోవడం కూడా మనిషి యంత్రానికి బానిస అవ్వడానికి కారణం.జీవ పరిమాణ సిద్దాంతం నిజం అని నమ్మే వాళ్ళు శరీరం ఎలా ఉన్నా ఎందుకు ఒప్పుకోలేరు? ఒప్పుకోరు కూడా ఎందుకంటే శరీర నిర్మాణాన్ని ఒప్పుకుంటే మనిషి ఆహారం పండించుకుని బ్రతికేస్తాడు, ఇక వీళ్ళు ఖాళీగా కూర్చుని డబ్బు సంపాదించలేరు.
మనిషి పనిచేస్తే మనిషికి కావలిసినది దొరుకుతుంది అదే Machine పనిచేస్తే ఒక్కడికే డబ్బులు వెళతాయి.
అగమ్యి:మీరు గతంలో ఒకసారి అన్నారు అందరి శరీరాలు ఒకేలాగా ఉండవు మరి ఈ ప్రక్రియలో కొంతమంది జబ్బులు పడే అవకాశం ఉంది కదా, మరి ఈ ప్రక్రియ అందరూ చేస్తారా?
 స్నేహితుడు:మొదట ప్రయత్నిస్తాం తరువాత వారి వల్ల కాకపొతే వారిని రానివ్వం.
అగమ్యి:సరే మరి మీకు ఇక్కడ ఎప్పుడూ ఆహార సమస్య రాలేదా?
స్నేహితుడు:రెండు రకాల అబద్దాలు చెప్పే వారు ఉన్నారు మొదటి రకం వాళ్ళను మనం వైద్యులుగా సంభోదిస్తాం రెండవ రకం వారు చిత్ర కథా నాయకులు.ఈ రెండు రకాల ప్రజల వల్ల జనాలకు పూర్వపు ఆచారాలు అంటే అపనమ్మకం వచ్చింది. మాకూ ఇక్కడ ఆహార కొరత వచ్చింది కానీ ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి కాబట్టి అవి మాకు అవరోధం కాలేదు.
అగమ్యి:అవి ఏమిటి?
స్నేహితుడు:మొదట ఆవులు
అగమ్యి:ఏమిటి మీరు మాంసం తింటారా?
స్నేహితుడు:అది మన దేశం యొక్క దుస్థితి ఆవులు తింటారు అనుకునే స్థాయికి వచ్చారు, నిజానికి ఆవులను మనం పూజిస్తాం, కానీ ప్రస్తుతం మన దేశం యొక్క దుస్థుతి ఎలా ఉందంటే పూజించేది ఆహారం కావాలి. మనం పరాన్న జీవులం కానీ మరీ ఇంత స్థాయిలో కాదు, మా నానమ్మ చెబుతూ ఉండేది కరువు వచ్చినా మా ఇంట్లో ఉండే ఆవు రోజుకు 3 లీటర్ల పైన పాలు ఇచ్చేది అని,అవి పితికి పిల్లలకు పట్టించేది.
అగమ్యి:అదేమిటి పాలు పాల కేంద్రాలలో ఉత్పత్తి చేస్తారు కదా ఆవులు నుంచీ పితకడం ఏమిటి విడ్డూరంగా!
స్నేహితుడు:నన్ను అపహాస్యం చేస్తున్నావా?(కొంచం కోపంగా)
అగమ్యి:అపహాస్యం చెయ్యట్లేదు నిజంగా నాకు పాలు ఆవు నుంచీ తీస్తారు అని తెలియదు.
స్నేహితుడు:అంటే christians యొక్క పాచిక పండిందన్న మాట మీ ప్రపంచంలో
అగమ్యి:వాళ్ళ పాచిక ఏమిటి?
స్నేహితుడు:వాళ్ళ దేశంలో లాగా మన దేశంలో కూడా పని వాళ్ళు ఎక్కువ కావాలి అన్న వాళ్ళ ప్రయత్నం, ప్రజలకు తమకోసం పనిచేసుకో నివ్వకుండా ఉండడం.
(సశేషం...)