అభివృద్ది గురించి తెలుసుకోండి - భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే!

సాధారణంగా ఆవులు ఒక్కోమారు నెమరు వేసి ఆహారం తింటాయి, దాని వల్ల ఆవులకు ఆహారానికి ఆహారానికి మధ్య సమయం ఎక్కువ ఉన్నా పెద్ద నష్టం వాటిల్లదు, కానీ ఈ ప్రక్రియ వల్ల ఆవులు పెద్దవి కావడానికి కొంచం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వాటి యొక్క మొదటి అన్నాశయము కు గుంత ఏర్పరచి ఆ ఆహారాన్ని నలిపి చిద్రం చేసి తొందరగా రెండవ జేర్ణాసయం కు చేరేలా చేసి మనిషి యొక్క నీచ స్థితి ని చూపిస్తున్నారు.
అవును ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నారు?
తండ్రి:సరే ఇంకా అడగను కానీ మనవడా నిద్ర వస్తుంది తరువాత చెబుతాను........
అలా అందరూ నిద్రకు ఉపక్రమించారు అగమ్యి తన పయనంలో మొదటి గమ్యం తెలుసుకున్నాడు!

తరువాత రోజు ఉదయం విశ్వనాధు తల్లిదండ్రులు ఉదయాన్నే లేగిచి అన్ని కార్యక్రమాలు ముగించుకుని విశ్వనాధు ప్రవచనాలు చేస్తున్న ప్రదేశంలో కుర్చున్నారు, అగమ్యి కూడా వారి చెంతనే కూర్చుని ఉన్నాడు, మీరు రోజూ ఇక్కడే కుర్చుంటున్నా రా అని అడిగితే అవును అనే సమాధానం మరి మీ గురించి రోజూ మీ గది ముందు కూర్చుంటున్నారు కదా స్వామి మరి గదిలో ఉండేది ఎవరు అని అంటే అసలు ముందు నీకు గుర్తుందా నువ్వు నిన్న రాత్రి ఏ గదిలోకి వచ్చావో అని ప్రశ్న,
తండ్రి:నిజానికి ఆ గదికి రెండు ద్వారాలున్నాయి, మేము ఒక ద్వారంలో లోపలి వెళతాము కానీ వీడు ఇంకో ద్వారం దగ్గర ఉంటాడు!
తల్లి:మొదట్లో కనీసం తాత అబ్బాయిని చూడటానికి ఒప్పుకోలేదు, తరువాత ఒప్పుకున్నారు.
తండ్రి:ఏమి చెయ్యగలను ఎంతైనా తల్లి ప్రేమ చూపగలదు తండ్రి మాత్రమే శిక్ష వేయగలడు.
ఇంతలో విశ్వనాధు వచ్చాడు, భారతీయుడు గురించి వెతికారు, కానీ భారతీయుడు అప్పటికే వెళ్ళిపోయాడు, ఎంతైనా డబ్బు పిచ్చి కదా!
స్వామి:వ్యాపారి, డబ్బు పెట్టించే పరుగులో ఇంకొకరు పరిగెడుతున్నారు.
ఆంధ్రుడు:స్వామీ సరే వాడి గురించి వదలండి, మీరు ఆలోచనా శక్తి పోగొట్టడం అన్నారు అంటే ఏమిటి?
స్వామి:మనం ఆలోచనా శక్తి కోల్పోడానికి కారణం ఇంకొకరికి పనిచేసింది అని, నిజానికి దీనికి బీజం వెయ్యడానికి మొదట ఎంచుకున్న అబద్దం సమానత్వం.
ఆంధ్రుడు:సమానత్వం మోసమా, ఏమిటి మీరు మాట్లాడుతున్నారు?
స్వామి:సమానత్వం అంటే నువ్వు అనుకునే కులం గురించి కాదు, శరీర నిర్మాణం గురించి గతంలో చెప్పాను కదా అందరి శరీర నిర్మాణాలు ఒకేలా ఉండవు, కానీ సమానత్వం పేరు చెప్పి అందరికీ ఒకే రకమైన మందులు తయారు చేసారు, అవి అందరికీ పనిచేస్తాయి అని నమ్మకం కలిగించారు, అవి వాతావరణం బట్టి పనిచేసే మందులు, శరీరం నల్లగా ఉంటే Lux వాడితే తెల్లగా మారిన వారు లేరు, కానీ మెదడులో ఇంకొకరు తెల్లగా ఉండటానికి కారణం Lux అని నిరంతరాయంగా ప్రకటనలు వెయ్యడం, ఇలా చాలా ఉన్నాయి.
ఆంధ్రుడు:మీకు అందం మీద చాలా దురభిప్రాయం ఉందనుకుంట, ఏమిటి మీకు ఆ దురభిప్రాయానికి కారణం?
స్వామి:చెప్పాను కదా గతంలో మనం అభివృద్ది అని చెప్పి మనిషి నిర్మాణానికి కావలిసినవి ఉపయోగించి మనం ప్రకృతి విరుద్ధమైన plastic లాంటివి చేస్తున్నాము వీటిని దాచి పెట్టడానికి, ఇక వీటి నుంచీ వస్తున్నా వ్యర్ధాలుఎక్కడ కరుగుతాయి?
ఆంధ్రుడు:అంటే మీ ఉద్దేశ్యం జనాలు అందంగా ఉండటం మానేయాలా?
స్వామి:నేను అలా అనలేదు, ప్రకృతి మనకు అవసరం లేనిది ఎప్పటికీ తయారు చెయ్యలేదు, కానీ మనకి మన పని చేసుకోవడం నామోషీ
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.