అగమ్యి గమ్యం లభించింది(మూడవ భాగం)

వ్యాపారి:ఇక మీలో కొంతమంది పాత కాలంలో మనుషుల లా ఉండటం వలెనే అభివృద్ది కుంటుపడుతుంది అని తెగ బాధ పడిపోతున్నారు. నియమాలను మనకు అనుగుణంగా మార్చుకుని ధనవంతులు కావడం అప్పుడే కాదు ఎప్పుడూ ఉంది. కానీ నియమాలు అర్ధం చేసుకుని బ్రతికితే అందరం సుఖంగా ఉంటాం, కానీ సుఖంగా ఉండటం అభివృద్ది కాదు అనే స్థితికి చేరుకున్నాము.
మనందరి కోసము: అభివృద్ది గురించి తెలుసుకోండి - భారతదేశం ఎప్పటికీ ...:
స్వామి:అదే నాయనా ఆలోచనా శక్తి నశించడం అంటే. మనిషిని తన జీవితం గురించి పని చెయ్యనివ్వకుండా ఇంకొకరి జీవితం గురించి పనిచేయించడమే అభివృద్ధి. మీకు సమయం ఉన్నా లేకపోయినా సంధ్యా వందనం సమయం అయ్యింది నేను నిష్క్రమిస్తున్నాను.
భారతీయుడు:మంచి చెప్పడానికి సమయం కావాలా?
వ్యాపారి:అక్కర్లేదు కానీ సృష్టి గమనాన్ని ఆచరించడానికి సమయం సరిగ్గా వెచ్చించాలి.
ఇక అక్కడ నుంచీ అందరూ నిష్క్రమించారు.ఎంత చెప్పినా భారతీయుడు వినలేదు, ఇక ఏమి చెయ్యాలో తోచక స్వామి నిజం చెప్పారు.
స్వామి:నేనుగత ౮ సంవత్సరాలుగా నా తల్లిదండ్రులను చూడలేదు, వాళ్ళ కు అవసరమైన సమయంలో వారికి నేను తోడు లేను, కాబట్టే నా ఈ స్థితి - ఇది శిక్ష అన్న అనుమానం మీకు రావచ్చు, కానీ నేను నాశనం చేసిన ప్రదేశాన్ని తిరిగి బాగు చేస్తున్నాను.
భారతీయుడు:మరి ఇక్కడే ఎందుకు?
స్వామి:నేను ఆక్రమించుకున్న స్థలం ఇది SEZ పేరుతొ సాగు భూములు అన్నీ ఆక్రమించు కున్నాను. నా తల్లిదండ్రులకు అది నచ్చక ఈ ఊరు చివర ఉన్న - ఇప్పుడు ఈ  ఆశ్రమం లో ఉన్న వృద్ధ ఆశ్రమంలో ఉన్నారు. ఇప్పటి వరకూ నాకు వాళ్ళు కనిపించలేదు. వారు ఉండే గది తెలుసు కానీ వారిని చూసే అవకాశం నాకు కలుగలేదు.
భారతీయుడు:ఎందుకు?
స్వామి:ఒక్కడ ఒక నియమం వారికి ఇష్టం లేకుండా నువ్వు వారిని కాలవకూడదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఇక మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి నేను మాత్రం నిష్క్రమిస్తున్నాను.
అగమ్యికి అర్ధం కాలేదు ఎంతైనా తల్లిదండ్రులు పిల్లవాడు మంచి వాడిగా మారితే ఆనందిస్తారు దీవెనలు అందిస్తారు మరి ఎందుకు వారు ముఖం చూపించాట్లేదో అర్ధం కాలేదు.
ఇక అగమ్యి రామానుజుల వారి దగ్గరకి వెళ్ళాడు.
రామానుజులు సంధ్యా వందనం పూర్తిగావించి ఇతని కోసం వేచి చూస్తున్నారు.
రామానుజులు:ఏమిటి నీ గమ్యం నిర్వతించాలి అని అనుకున్నావా?
అగమ్యి:మీ అభిప్రాయం! నేను చేయ్యాను అనా?
రామానుజులు:కాదు నాయనా నిన్నటి వరకూ అదే అన్నావు కదా నువ్వు, అందుకే అడిగాను.
అగమ్యి:ఏమో స్వామి మీరు చెప్పినది నిజం అనిపిస్తుంది. నాకు విశ్వనాధు బాధ చాలా పెద్దదిగా అనిపిస్తుంది.
రామానుజులు:నీకు ముందే చెప్పాను శిక్ష నుంచీ తప్పించుకోవడానికి మార్గం తను చేసిన తప్పుకు తానే శిక్ష విధించుకోవడం, తప్పును కప్పి పుచ్చడం కాదు. తప్పును కప్పి పుచ్చినా ఎదో ఒకరోజు అది బయట పడకా మానదు ఒక వేళ శిక్ష పడకపోయినా అది వేరేచోట పడకా తప్పదు.
అగమ్యి:స్వామి అది సరే కానీ ఇంతకీ వాళ్ళు ఎందుకు కనిపించాను అంటున్నారు?
రామానుజులు:అతనికి వాళ్ళను గుర్తించే శక్తి పోయింది. వాళ్ళు ఎదురుగా తారస పడినా గుర్తించట్లేదు. ఏ తల్లి దండ్రులూ పిల్లలను ద్వేషించరు, ఇక్కడ విశ్వనాధు కేవలం ఒక కన్నంలో మట్టి ఉన్న ఒక కుట్టు సూది. అది తొలగించాలి నువ్వు.
అగమ్యి:అర్ధం కాలేదు!
రామానుజులు:విశ్వనాధు తల్లిదండ్రులు America నుంచీ తిరిగి వచ్చాకా చర్మం కొంచం చెడిపోయింది.అర్ధం కాలేదు, వాళ్ళు వైద్యుడి దగ్గరకు వెళితే మీరు ఈ మందులు వాడ కూడదు అని ఆ వైద్యుడు చెప్పాడు. ఆ మందులు వారు America లో ఉండగా అక్కడ వైద్యుడు వ్రాసినవి.
అగమ్యి:అదేమిటి మందులు ఎవరికైనా ఒకటే కదా!
రామానుజులు:అది కొంత బ్రమ, కొన్ని మందులు వాతావరణం బట్టి వాడాలి. దీని గురించి నాకన్నా వైధ్యుడే బాగా చెప్పగలడు.
అగమ్యి;మరి వైధ్యం ఆపెసారా?
రామానుజులు:ఆ వైధ్యుడు కేవలం వాడకూడదు అని తెలుసుకున్నాడు కానీ దానికి చికిత్స అతనికి తెలియదు, కేవలం అది పెరగకుండా కాపాడుతున్నాడు ఈ ౭ వత్సరములు.
అగమ్యి:అదేమిటి ౮ సంవత్సరాల నుంచీ ఆయన చూడలేదు అంటున్నారు, మీరు ౭ వత్సరములు అన్నారు.
రామానుజులు:వారు ఇక్కడకు వచ్చి ౮ వత్సరాలు అయ్యిందో లేదో సరిగ్గా గుర్తులేదు కానీ ఇక్కడ ఆయన చికిత్స పొందుతూ ఉన్నది ౭ వత్సరాలు నుంచీ.
అగమ్యి:నాకు కొంచం పరిచయం చేస్తారా?
రామానుజులు:మరి వాళ్ళను చూసి ఈసడించు కోకూడదు.
అగమ్యి:నా గమ్యం కలపడం అయితే ఎలా ఉన్నా కలుపుతాను!!!!!!!!!!
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.