కొన్ని కొన్ని సలహాలు పాటిస్తే ఈ ప్రపంచంలో జీవనం చాలా సులభం

ఆంధ్రుడు:అవును Transcript ఎలా మార్పించారు?
మనల్ని రక్షించు కోవాలి అంటే డబ్బు కోసం పాకులాడని వాళ్ళు మన దగ్గర ఉండాలి
అగమ్యి:మాకు ఇవ్వగలరా, ఏమైనా ప్రత్యన్యాయం ఉందేమో తెప్పించగలం
స్వామి:తెప్పించాను కానీ వాళ్ళు వాడట్లేదు అని తెలిసింది, ఎలా నమ్మించగలను నిరూపించాలి నేను తప్పు చెయ్యలేదు అని?
ఆంధ్రుడు:ఇప్పటి వరకూ తప్పులు చేసాను అన్నావు మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి?
స్వామి:ఆగు నాయనా నేను తప్పు చెయ్యలేదు అన్నది వాళ్ళ విషయంలో, మిగిలిన వాటిల్లో కాదు.
తండ్రి:ఓరినీ సంబడం, నీకు కంగారు దేనికి?(అగమ్యితో)
అగమ్యి:తాత నిన్ను గుర్తు పట్టడం నాకే కాదు అందరికీ కష్టమే!
తండ్రి:అందుకే కదా ఈ శిక్ష
అగమ్యి: తాతా శిక్ష నువ్వు మీ అబ్బాయికి వేసినట్లు లేదు నీకు నువ్వు వేసుకుంటున్నట్లు ఉందిట
తల్లి:నేను అదే అన్నాను కానీ వినలేదు తాతా
అగమ్యి: ఏమి తాతా ఇలాగైతే ఎలాగా
తండ్రి:నెమ్మది వాడికి అనుమానం వస్తుంది, వాడికి మేము ఇక్కడే ఉన్నాము అని తెలిస్తే ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని అని అడుగుతాడు, మేము వాడు చేసిన తప్పులు చూపిస్తాం కానీ వాడు వాటిని తప్పులు కాదు అంటాడు, గతంలో కూడా ఇలాగే జరిగింది, అందుకే వాడు తెలుసుకోవాలి అనే నా ఈ ప్రయత్నం.
తల్లి:అది కాదు ఆయన కోపం మేము ఇలా ఉన్నాము అని తెలిసికూడా ఒక్కసారి కూడా రాలేదు కదా అందుకు.
తండ్రి:దీని గురించి తరువాత చర్చించుకుందాం, వాడికి అనుమానం రానివ్వద్దు.
స్వామి:ఏమిటి మీ చర్చా గోష్ఠి?
అగమ్యి:ఏమీ లేదు ఇన్ని చెప్పారు కదా అసలు మనం ఆనందంగా బ్రతకాలి అంటే ఏమి చెయ్యాలి అని ప్రశ్న?
స్వామి:దానికి సమాధానం కేవలం ఇక్కడ అందరికీ స్నేహితుడు మాత్రమే తెలుప గలడు. వ్యాపారి వెళ్ళి అందరి స్నేహితుడునీ పిలు.
వ్యాపారి స్నేహితుడుని తోడ్కొని వస్తాడు
స్నేహితుడు:భగవంతుని సృష్టిలో పనికి రానిది ఏమీ లేదు, జీవ పరిమాణ సిద్దాంతం ప్రకటించిన వాళ్ళు  దాన్ని ఒప్పుకున్నారు కానీ భగవంతుడు కాదు ప్రక్రుతి అంటారు. అంటే దాని అర్ధం పనికి రానిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని, కానీ సృష్టికి ప్రతి సృష్టి చెయ్యాలి అనే తపనతో మనిషి తన ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటున్నాడు.
ఆంధ్రుడు:అది ఎలాగా?
స్నేహితుడు:బలవంతుడు కావడానికి వాడే ప్రత్యామ్నాయాలు తరువాత అతనికి అవి లేకపోతె బ్రతకలేని స్థితికి తీసుకు పోతాయి.
ఆంధ్రుడు:ఏమిటవి?
స్నేహితుడు:తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా?
ఆంధ్రుడు:నిషేదించాల్సిన వాటి గురించి అడుగుతున్నాను!
స్నేహితుడు:మొదటగా ద్వేషం ఇది మనిషిని నసింప చేస్తుంది, రెండు అసూయ  ఇది ప్రత్యామ్నాయాలు కు మూలం తరువాత ఈర్ష్య ఇది కూడా అంతే.
ఆంధ్రుడు:మరి కోపం?
స్నేహితుడు:వీటి వల్ల వచ్చేదే కోపం, ఇవి లేకపోతే కోపం మీ దరిదాపుల్లోకి రాదు కదా.
ఆంధ్రుడు:కొంచం ఉదహరిస్తే బగున్తున్ది.
స్నేహితుడు:మీకు స్వామి మునుపే చెప్పారు కదా, సరే ఉదహరిస్తాను. మొదటగా ద్వేషం దీనికి కారణం చాలా చిన్నది అది మనకి నచ్చనిది, అంటే నీకు ఎవరైనా నచ్చనిది ఇస్తే వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటావు, అది తరువాత కోపంగా పరివర్తనం చెంది ఆ మనిషిని దూరం చేసుకుంటావు.
ఆంధ్రుడు:అంటే మీ ఉద్దేశ్యం మనమే కొందరిని జీవితంలో నుంచీ తీసేస్తామా?
స్నేహితుడు:దానికి నా దగ్గర సమాధానం లేదు అది నీ పరిపక్వత బట్టి ఉంటుంది, ఇక తరువాత అసూయ ఇది ఈర్ష్య దగ్గర దగ్గరగానే ఉంటాయి కానీ అసూయ మన వాళ్ళు కొంతమందినే ఉన్నత స్థితిలో ఉంచడానికి ఇష్టపడటం వలన ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళ మీద అసూయ కానీ ఈర్ష్య వలన ఉన్నత స్థితిని ఆక్రమించుకోలేదు అనే బధ.
ఆంధ్రుడు:సరే ఈ ఉదాహరణలు బాగానే ఉన్నాయి కానీ వీటి వల్ల మనం బాధలలో ఉన్నాము అంటున్నారు ఇవి లేకపోతె బాధలు ఉండవా?
స్నేహితుడు:ఇవే బాధలు, సరే నిషేదించ వలిసిన వస్తువులు చెబుతాను,
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.