శాసించడమే మన పనా? ప్రకృతి అవసరం లేనిది ప్రసాదించిందా?


స్నేహితుడు: అందుకే అప్పట్లో అవి కట్టే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకునే వారు, ఉదాహరణకు వెదురు కర్రలతో కట్టే ఇళ్ళు చొట్టూ సాధారణం గా పెద్ద చెట్లు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉండేవి, మట్టి గోడల ఇళ్ళు చెరువుల దగ్గరలో ఉండేవి, వాటి వలన కొంతలో కొంత నష్టం తగ్గించ గలిగే వాళ్ళు. ఇక పొతే ప్రతీ ఒక్కరి ఇంట్లో అవుగానీ గేదేగానీ ఉండేది, ఇప్పుడు?
ఎవరిది బాధ్యత?
స్నేహితుడు:కాదు ఇలా మనిషి సుఖంగా బ్రతికే విధానాలు మరుగున పర్చడం వలన ఈ స్థాయిలో ఉన్నాము.
ముందుగా మనం నిర్మాణాలు ఆపేస్తే ఆనందంగా బ్రతకగలము. పేక మేడలు మన జీవితాలు, మనం అంతా ఎడారిలో నీటి నిల్వ చెయ్యడానికి ప్రయత్నిస్తూ నీళ్ళు ఉన్న ప్రదేశాలను ఎడారిగా మారుస్తున్నాము.
దేవుడు ఇచ్చిన లేదా అదేదో సిద్దాంతాలు నమ్మే వాళ్ళు
ఒక వ్యక్తి:జీవ పరిమాణ సిద్దాంతం.
స్నేహితుడు:అదే, ప్రకృతి తనకి నచ్చినట్టు మనిషిని తాయారు చేసింది, ప్రకృతి మనిషికి కావలసినవి ఇచ్చింది, కానీ బుద్ధిని మాత్రం ఇవ్వలేదు. అదే ప్రకృతి చేసిన తప్పు.
ఆంధ్రుడు:అంటే మాకు బుద్ది లేదు అనా మీ అభిప్రాయం?
స్నేహితుడు: నిజమే ఎందుకంట,ప్రకృతి ప్రసాదించిన వాటిని మనకు అనుకూలం కాకపొతే నాశనం చెయ్యడం మొదలు పెట్టాము కాబట్టి.
ఆంధ్రుడు:ఏమిటి ఆ నాశనాలు మనం చేసినవి?
స్నేహితుడు: మొదటగా ఇళ్ళు కట్టడం.
ఆంధ్రుడు:మొదలు పెట్టినప్పటి నుంచీ చూస్తున్నాను ఇళ్ళు కట్టడం అంటే నాశనం  చెయ్యడం అంటున్నారు ఇదేమీ బాగోలేదు.
స్నేహితుడు:నేను మొదటి నుంచీ అదే మాట మీద ఉన్నాను, ఎందుకంటే అది ఒక ఆడంబరం కాబట్టి. కేవలం ధనం ఉంది అన్న ఒక్క కారణం నీ చేత ఈ పని చేయిస్తుంది. ఇక దీనికి కారణం చెబుతాను మనం ఇళ్ళు కడుతున్నాము అంటే మనం మన శరీర నిర్మాణానికి అవసరమైన వాటిని పనికి రాకుండా చేస్తున్నాము అని.
ఆంధ్రుడు:మన శరీర ఎప్పుడో నిర్మించ బడింది
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.