అవసరమైన వాటి మీద నియంత్రణ ఉండదు అనవసరమైన వాటి మీద రాయితీలు - మధ్యవర్తికి లాభాలు

స్నేహితుడు:ప్రతీ ఒక్కడూ వాళ్ళను గొప్ప వాళ్ళ లాగా చూడటం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు చేసే హాని అంతాఇంతా కాదు, కేవలం ఒక్క వ్యాపారస్తుడు చేసే దానికి మూడు రెట్లు నష్టం వాళ్ళు కలిగిస్తున్నారు, Naxals పుట్టుకే ఒక విచిత్ర కథనాల సమాహారం, ఒకడు భూస్వామి మోసం చేసినందుకు మారాను అంటాడు ఇంకొకడు వ్యాపారస్తుడు మోసం చేసినందుకు మారాను అంటాడు, అది భూస్వామ్య వ్యవస్థ మనుషులను పీల్చి పిప్పి చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కళాశాలలకు వెళ్ళి అక్కడ విధ్యార్ధులను Naxals గా మారుస్తున్నారు, మీరు అంటున్న recruitments కూడా జరుగుతున్నాయి.
మూత పడుతున్న ఖజానా సంస్థలు (Banks are getting closed)
స్నేహితుడు: ముందుగా జనాలకు డబ్బు పిచ్చి పోవాలి, ఇక కరువు ఒక ప్రదేశం లో విలయ తాండవం చేస్తుంది అంటే అక్కడకు స్వచ్చందంగా సాయం చెయ్యడానికి జనాలు ముందుకు రావాలి, ఇక మూడవది నీటి లభ్యత. మనలో చాల మంది చేతులు కాలాకా బావి తవ్వే రకాలు.
ఆంధ్రుడు:అదేమిటి మేము సంపాదిస్తుంటే ప్రభుత్వం ఆ పన్ను ఈ పన్ను అని చెప్పి మా దగ్గర గుంజి రాయితీలు ఇస్తుంది కదా.
స్నేహితుడు: మన ఈ ద్వంద నాలుక మనకు సహజమే ప్రజలు దేనికైనా ప్రభుత్వాన్ని నిందించడం సహజం, మరి మీ నాలుక ద్వంద నాలుక అని ఎందుకు అన్నాను అంటే సమాజ హితం కోరడం మీకు అలవాటు కానీ సమాజ హితం కోసం మీరు చెయ్యరు చేసే వాళ్ళను నిందిస్తారు, ఇక మీరు అన్న ఈ పన్ను గుంజడం అన్నది తప్పని రాక్షసత్వం అని ఒప్పుకుంటాను, కానీ దీనికి కారణాలు అనేకం, కానీ వీటితో లాభ పడుతున్నది ఎవరు అన్న దాని గురించి చర్చించుకుందాం ఇక మనం ఎందుకు పోరాడట్లేదు అని కూడా తెలుసుకుందాం!
ఆంధ్రుడు:ఎందుకు పోరాడట్లేదు?పోరాడుతున్నాం కదా కనిపించట్లేదా?
స్నేహితుడు:  దాని గురించి తరువాత చర్చిచుకుందాం, మొదట ఒక ముఖ్య మంత్రి ప్రజాహితం కోసం ౯ సరుకులు తక్కువ ధరకు ఇస్తున్నాము అన్నాడు, అందరిలాగానే అమ్మ జపం చెయ్యడం పరిపాటే కదా చేసాడు, ఆ ౯ సరుకులు నిత్యావసర వస్తువులు ఎలా అయ్యయో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు, ముందుగా ఆరోగ్యరీత్య మాట్లాడుకుందాం
౧. కంది పప్పు - కొంతవరకూ ఇది నిత్యావసర వస్తువే దీని మీద రాయితీని విభేదించ లేము.
౨. palm oil - ఇది నిత్యావసర వస్తువు కాదు, ఇంకా చెప్పాలి అంటే దీని వల్ల స్థూల కాయం ఎక్కువగా వస్తుంది - palm oil, దీనికన్నా వేరుశనగ మీద రాయితీ ఇచ్చుంటే అందరూ ఆనందించే వారు.
౩. చక్కర - ఇది కొంచం ఆనందిచాల్సిన విషయం. కానీ స్థూల కాయులకు అనవసరం.
౪. గోధుమలు - ఇది నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితి - ఇది నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేరడం ఆశ్చర్యకరం.
౫. గోధుమ పిండి - ఇది అత్యంత హేయమైన స్థితి
౬. పసుపు - చిటికెడు పసుపు ఆరోగ్యం, దీని గురించి గతంలో చర్చించు కున్నాం మళ్ళీ చర్చించుకుందాం.
౭. చింత పండు - ఆంగ్లేయుల కాలం నుంచీ కలకలం సృష్టించినదే, నిజానికి చింతపండు వల్ల ఆరోగ్యానికి చేటు, దీనికన్నా నిమ్మకాయలకు ఇచ్చి ఉంటె వేసవిలో చల్లదనం ఆరోగ్యం.
౮. కారం - ఇది కూడా ఆరోగ్యానికి చేటు. ఇక దీనిలో మోసాలు దీనిలోనివే.
౯. ఉప్పు - దొరకనిదా? దీని మీద రాయితీ ఏమిటో అర్ధం కాలేదు.
ఆంధ్రుడు:ఏమిటి ఈ ౯ ఉపయోగ పడనివా?
స్నేహితుడు: వేసవిలో ప్రజారోగ్యం ఇచ్చే వాటి మీద రాయితీ ఉన్నా పర్వాలేదు కానీ ప్రజారోగ్యం ఇవ్వని వాటి మీద రాయితీ దేనికో అర్ధం కాదు.
ఆంధ్రుడు:అంటే మీ అభిప్రాయం ఏమిటి?
స్నేహితుడు:వేసవిలో మజ్జిగ నిమ్మరసం వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చెయ్యాలి, కానీ ఆరోగ్యం తెచ్చే వాటిని మనం అందుబాటులోకి రానివ్వం కదా, పైగా వాటిని అందుబాటులోకి తెస్తే మధ్య వర్తి లాభ పడడు కదా!
ఆంధ్రుడు:ఇంతకీ మీ అభిప్రాయంలో మధ్యవర్తి ఎవరు, రైతు నుంచీ కొని గిడ్డంగులలో దాచేవాడా గిడ్డంగులలో కొని వ్యపరస్తుడికి ఇచ్చెవాడా లేదా వ్యాపారస్తుడా?
స్నేహితుడు:మొదటి రెండు రకాల వారు.
ఆంధ్రుడు:అంటే వ్యాపారస్తుడు మోసం చెయ్యడా?
స్నేహితుడు:కొంచం క్లిష్టమైన ప్రశ్న ఎందుకంటే, అతనికి రోజంతా కూర్చుంటే ఒక్కోసారి ఒకరోజు అతను బ్రతకడానికి అవసరమైన కిరాయి గిట్టదు.
ఆంధ్రుడు:కిరాయి కాదు లాభం.
స్నేహితుడు: మీకు వాళ్ళు కన్పించేది లాభం, కానీ నిజానికి వాళ్ళకు అది కిరాయి. ఇక ప్రభుత్వ పధకాల వలన లాభ పాడేది మధ్య వర్తి ఎలా అయ్యాడో తెలుసుకుందాం.
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.