మూత పడుతున్న ఖజానా సంస్థలు (Banks are getting closed)

స్నేహితుడు: కానే కాదు, కుటుంబం ఉంటేనే మనిషి ఆనందంగా ఉండగలడు, వాళ్ళ బాధ అదే వాళ్ళ కుటుంబంలో సాయం చేసే వాళ్ళ కన్నా సాయం ఆశించే వాళ్ళు ఎక్కువ, అందుకు ఉమ్మడి కుటుంబాలను విడగొట్టారు, సాయం చెయ్యడం ఆపించేసారు, శత్రుత్వం పెంచడం లాంటివి చేసార.
సమాధానం లేని ప్రశ్నలు ఉంటాయా? సమాధానాన్ని అమలు పరిచే వాళ్ళు లేరా?
స్నేహితుడు:ప్రతీ ఒక్కడూ వాళ్ళను గొప్ప వాళ్ళ లాగా చూడటం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు చేసే హాని అంతాఇంతా కాదు, కేవలం ఒక్క వ్యాపారస్తుడు చేసే దానికి మూడు రెట్లు నష్టం వాళ్ళు కలిగిస్తున్నారు, Naxals పుట్టుకే ఒక విచిత్ర కథనాల సమాహారం, ఒకడు భూస్వామి మోసం చేసినందుకు మారాను అంటాడు ఇంకొకడు వ్యాపారస్తుడు మోసం చేసినందుకు మారాను అంటాడు, అది భూస్వామ్య వ్యవస్థ మనుషులను పీల్చి పిప్పి చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కళాశాలలకు వెళ్ళి అక్కడ విధ్యార్ధులను Naxals గా మారుస్తున్నారు, మీరు అంటున్న recruitments కూడా జరుగుతున్నాయి.
ఆంధ్రుడు:అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులను ధనవంతులు చేసే వాళ్ళను చెదగోడుతున్నారు అంటావు!
స్నేహితుడు:నిజమే అది గమ్యం లేని వాడి ప్రయాణం, గమ్యం ఉన్న వాడి ప్రయాణం ఎప్పుడూ ప్రకృతిని నాశనం చెయ్యనిదిగా ఉంటుంది, నిజానికి ఇద్దరూ తేడాలేని వాళ్ళే వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ AC లలో ఉండాలి అనుకుంటాడు Naxal ఎల్లప్పుడూ భూస్వామ్యుల వల్లే ఈ కష్టాలు అంటుంటాడు .
ఆంధ్రుడు:మరి నిజం?
స్నేహితుడు: మనిషిలో మానవత్వం నశించడం, మానవత్వం ఉన్నా ధనం ఇవ్వలేక పోవడం.
ఆంధ్రుడు:అర్ధం కాలేదు?
స్నేహితుడు:ఒక నొక సమయంలో ఒక ఊరు కరువులో కొట్టు మిట్టాడుకుంటుంది ఆ ఊరు లోతట్టు ప్రాంతమే కానీ ఆ ఊరుకు వచ్చే నీటిని మధ్యలో స్థాపించిన Retail stores వాళ్ళు తమ గదులు శుభ్రం చేసుకోవడానికి AC చల్లార్చడానికి ఉపయోగించడం మొదలు పెట్టారు.
ఆంధ్రుడు:లోతట్టు ప్రాంతం అయితే అక్కడ నీళ్ళు సమృద్ధి గానే ఉంటాయి కదా!
స్నేహితుడు:అక్కడకు నీళ్ళు వచ్చినప్పుడు, నీళ్ళు రానివ్వలేదు, అప్పు ఇవ్వడానికి Banks ఎప్పుడో మూతపడిపోయాయి, ప్రభుత్వమా ఎన్నికలప్పుడు హామీలే తప్పించి ఆ ఊరికి నీరు అందుబాటులోకి వచ్చేలా చెయ్యడం గాలికి వదిలేసింది.
ఆంధ్రుడు:మొదటి ప్రశ్న Banks ఎందుకు మూత పడ్డాయి, పల్లెటూర్లలో Banks తప్పక ఉంచాలి అనే నియమం ఉంది కదా!
స్నేహితుడు:నిజమే, ఆ ఊర్లో bank ఉంది కానీ అక్కడ గుమస్తానే లేరు, ఎందుకంటే అక్కడికి పనిచెయ్యడానికి ఎవ్వరూ రారు, ఇక నీ తరువాత ప్రశ్న స్వచ్చంద సంస్థలు ఏమీ చెయ్యట్లేదా అనే కదా?
ఆంధ్రుడు:అవును!
స్నేహితుడు:ఒక తరంలో కొంతమంది భూస్వాములు ఉండే వారు Naxal ఉద్యమం పుణ్యమా అని భూస్వాములు పంథా మార్చుకున్నారు, ధనం ఉందా వెళ్ళి stock market లో పెట్టడం దాంతో ఇదివరకూ ప్రజలను అణగ దొక్కి సంపాదించడం కంటే సులువైన మార్గం దొరికింది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్న చందాన ప్రతీ ఒక్కడూ డబ్బు ఉందా వెళ్ళి stock market లో పెట్టు అనే ఆలోచనకు వచ్చి ధనం దానం చెయ్యడానికి ముందుకు రావట్లేదు!
ఆంధ్రుడు:సరే నువ్వు అన్నదే నిజం అనుకుందాం మరి ఈ కష్టానికి తరుణోపాయం ఏమిటి?
స్నేహితుడు: ముందుగా జనాలకు డబ్బు పిచ్చి పోవాలి, ఇక కరువు ఒక ప్రదేశం లో విలయ తాండవం చేస్తుంది అంటే అక్కడకు స్వచ్చందంగా సాయం చెయ్యడానికి జనాలు ముందుకు రావాలి, ఇక మూడవది నీటి లభ్యత
(సశేషం ..)