ప్రతీ ఒక్కడూ పనిచేస్తూ ఉండటమే కావాలి, కానీ ఉద్యోగాలు మాత్రమే లేవు!

ఆంధ్రుడు:అది అందరికీ తెలిసిందే ఇక మీరు చెప్పారు కదా ఎవరు లాభ పడతారు?
నిజాలు మనకు తెలియవు, వాళ్ళ లాభాల కోసం ప్రచురణులు మనం తిరిగి ముద్రిస్తాం అది మన దౌర్భాగ్యం
స్నేహితుడు: Hybrid సంస్కృతీ!
ఆంధ్రుడు:ఏమిటా Hybrid సంస్కృతి?
స్నేహితుడు: ప్రస్తుత ప్రపంచం దేవుడు మనకు ఇచ్చిన అన్నిటినీ తిరిగి తయారు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము, మనిషికి అవసరమైన వాటిని పనికి రాని వస్తువులుగా మారుస్తున్నాము.
ఆంధ్రుడు: ఇంతకీ Hybrid సంస్కృతీ అంటే ఏమిటి?
స్నేహితుడు: అందరికన్నా వేగంగా ఉండాలి అని మనం తయారు చేసుకున్న యంత్రాలు, మనం వాడుతున్న కృత్రిమ వ్యవసాయ పద్దతులు.
ఆంధ్రుడు: అంటే Electricity అన్ని వినాసకాలకు మూల కారణం అంటావు!
స్నేహితుడు: నిజమే తొందరగా ముగింపు పలకాలి అని లేదా అందరికన్నా ముందుండాలి అనే ప్రయత్నం ఎప్పుడూ మనం చేస్తుండే దే అవే మన కొంప ముంచుతున్నాయి.
ఆంధ్రుడు:అంటే మనకు పనికి రానివి ఏమీ లేవా?
స్నేహితుడు: లేవు అనట్లేదు కొందరికి మాత్రమే పనికి రావు, కానీ అభివృద్ది అని పేరుచెప్పి అబద్దాలు పెంచి మన దగ్గర నుంచీ మన పెద్దలు వ్రాసిన వాటిని దూరం చేసారు. కానీ వాటిని తిరిగి ఎవరైనా చదువుతుంటే నీకు మతి చెడింది అనే ప్రచారాలు.
ఆంధ్రుడు:అంటే మేము చదువుతున్నది దేనికీ పనికి రానిదా!
స్నేహితుడు:వేరే చెప్పాలా? పొలం పనులు ఎలా చెయ్యాలో తెలియదు, ఆవులు గేదెలు ఏ రకంగా పెంచితే మంచి పాలు ఇస్తాయో తెలియదు,  మొక్కలు పెంచడం అనేదే లేదు.
ఆంధ్రుడు: అవన్నీ చిన్న పిల్లలలకు తెలిపితే ఎప్పుడు చదువుతారు?
స్నేహితుడు: నేను అడుగుతున్నాది అదే వాటిని పాఠ్యాంశములుగా ఎందుకు చేర్చరు అని!
ఆంధ్రుడు:అదేమిటి వాటిని పాఠ్యాంశములుగా చేరిస్తే ఇంకేమైనా ఉందా వాళ్ళు అలసిపోతారు.
స్నేహితుడు: ఆ బద్దకాలకు మూలమే మనం తయారు చేసుకున్న ఈ అబద్దపు సిద్దాంతాలు, అశాస్త్ర విజ్ఞానం.
ఆంధ్రుడు: అంటే వీటి వల్ల ఉపయోగం లేదు అంటారు!
స్నేహితుడు: నిజంగానే లేదు.
ఆంధ్రుడు: ఉపయోగం లేని వస్తువులు చెప్పండి?
స్నేహితుడు: నువ్వు ఉపయోగించే వస్తువులు చెప్పు ఉపయోగం ఉందో లేదో నేను చెబుతాను!
ఆంధ్రుడు: ముందుగా విద్యుత్తు దీపం.
స్నేహితుడు: నిజమే మనం ముందుగా చర్చించుకోవాలి దీని గురించి. ఇవి లేని రోజులలలో సూర్యుని శక్తి మీద ఆధార పడే వాళ్ళం సూర్యుడు ఉన్నప్పుడే దినచర్యలు ముగించే వాళ్ళం, ఇది వచ్చాకా మన దైనందన జీవితంలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు, అతి ముఖ్యంగా వీటి వల్ల మనం పొందిన లాభం పగటి పూట కూడా విద్యుత్తు దీపం వెలిగించడం.
ఆంధ్రుడు: అది అవసరం, కాబట్టి
స్నేహితుడు: కాదు అది ఏ రకంగానూ పనికి రాదు, మనం చేసుకున్నాం.
ఆంధ్రుడు: చేసుకోవడం లేదు పాడు లేదు.
స్నేహితుడు: నిజమే మనకు పడమటి పద్దతులు ఎక్కించి ఇలా తయారు చేసారు, నిజానికి పద్దులు అవీ వేసుకోవడానికి మన పూర్వీకులు రచ్చబండలు ఏర్పాటు చేసుకుని, తీరికగా పూర్తి చేసారు, కానీ పడమటి వాళ్ళు ఒకటి తెలుసు కున్నారు పిల్లి పిల్లి తగువులాట కోతి తీర్చింది అన్న చందానా, వాళ్ళకు కావలసినది అందరూ కొట్టుకోవాలి.
ఆంధ్రుడు: ఏమిటో ఒక్క విషయం కూడా అర్ధం అయ్యేట్లు చెప్పట్లేదు కదా!
స్నేహితుడు: వాళ్ళు బ్రతికే విధానం ఎదుట వారిని అభద్రతా భావానికి గురి చేస్తే భద్రత కల్పించే సామాగ్రి కొనడానికి వస్తారు, దాంతో మనం డబ్బు సంపాదించ వచ్చు అని, నిరంతరం అదే చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళకు వాళ్ళు ఎసరు పెట్టుకున్నారు, యుద్ధ సామాగ్రి రెండు వైరి వర్గాల వాళ్ళకు అమ్మారు కానీ ఒక వైరి వర్గం ఆ యుద్ద సామగ్రితో వాళ్ళ మీదే దాడికి దిగింది, దాంతో బెంబేలెత్తి యుద్ధం మానవతా వాదం కాదు అనే ప్రచారం మొదలు పెట్టారు. ఇలా ద్వంద నాలుక ఉండటం. ఇక ఆ పంథా కుదరదు అని కొత్త పంథా ఎంచుకున్నారు, ఇప్పటికే ఇబ్బుడిముబ్బిడిగా ఈ పంథాలో సంపాదించిన ధనం బడా బాబులకు చేరట్లేదు కేవలం ప్రభుత్వం దగ్గర పడి ఉంది అని చెప్పి భిన్నమైన ప్రయత్నాలు మొదలు పెట్టి అటు వాళ్ళ దేశీయుల జీవితాలు నాశనం చెయ్యడమే కాకుండా ప్రపంచం మొత్తాన్నీ నాశనం చేసారు. ఇవి కావన్నట్టు వాళ్ళ దేశంలో ధరలు అధికంగా ఉండి వేరే దేశంలో ధరలు తక్కువా అని తెలిసిందా ఆ దేశంలో పేదరికం మీద ఒక ప్రకటన వదలటం రివాజుగా మార్చుకున్నారు.
ఆంధ్రుడు:అంటే వాళ్ళు ప్రకటించినట్లు మన దేశంలో పేదరికం లేదు అంటావా?
స్నేహితుడు: లేదు అని ఎప్పుడూ అనను కానీ ఖర్చు పెట్టె ధనం వాళ్ళ దేశంతో సరి పోల్చడం గురించి మాత్రమే నేను మాట్లాడు తున్నాను.
ఆంధ్రుడు:అంటే
స్నేహితుడు: వాళ్ళ దేశంలో కిలో బియ్యం ౩ Dollars ఉంటె మన దేశంలో కిలో బియ్యం ౩౦ రూపాయలు లేదు అని వాళ్ళ బాధ. ఇక ప్రపంచ ద్రవ్య సంస్థ బాధ దానిది, వడ్డీ వస్తున్నా వాళ్ళు కోరుకున్న చందానా అందరూ మారలేదు అని.
ఆంధ్రుడు: ప్రపంచం ద్రవ్య సంస్థ ప్రజలు ఎలా ఉండాలి అని కోరుకుంది,
స్నేహితుడు: పని వాళ్ళుగా, తమకు భోజనం దక్కాలి అంటే ఇంకొకరి మీద ఆధార పడటం, అది వట్టి ప్రపంచ ద్రవ్య సంస్థ మాత్రమె కాదు కిరస్తానీ సంస్థలు భూస్వాములు కోరుకునేదే
(సశేషం ..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.