ఆత్మీయుల గురించి తెలుసుకోవడానికి Bru కు వస్తున్న calls

౧. నా భార్య గురించి నాకు తెలియదు ఎలా తెలుసుకోవాలి, వివరాలు చెప్పండి అని అడిగితే అవి తెలియకే కదా మెమ్మల్ని అడిగింది, అని ఒక తలివైన బ్రమ్హచారి సమాధానం 
౨. నా భార్య గురించి నాకు తెలియదు ఎలా తెలుసుకోవాలి, వివరాలు చెప్పండి అని అడిగితే మూడు సంవత్సరాల క్రితం విడిపోయాము, ఆమె పేరు ఫలానా ఊరు తెలియదు ఎక్కడ ఉందొ తెలియదు - ఈ call చేసిన వ్యక్తీ ౩ సంవత్సరాల క్రితం స్వతంత్రం పొందాను అనుకున్నాడు.
౩. నా పిల్లల గురించి నాకు తెలియదు ఎలా తెలుసుకోవాలి, వివరాలు చెప్పండి అని అడిగితె వాళ్ళు ౫ సంవత్సరాల క్రితం తప్పిపోయారు!!
ఇవి కాకుండా ఇంకో విధమైన calls, మీ సలహా పాటిద్దాం అని మా వారికి పిల్లలకు కాఫీ అలవాటు చేద్దాం అనుకుంటే వాళ్ళు నల్లగా తయారవుతున్నారు. ఇంకొకరి బాధ కాఫీ విషంలా ఉంది అని వాంతులు చేసుకుంటున్నారు అని. ఇంకొకరు నిజంగా కాఫీ ఎలా పెట్టుకొవాలో తెలియక. ఇంకొకరు కాఫీ పోడం గడ్డకట్టింది అని, ఇంకొకరు మా ఇంట్లో చక్కర వ్యాధిగ్రస్తులు ఉన్నారు మరి పంచదార వేసుకోవచ్చా అని, ఇంకొకరు నిజంగా చిత్ర పరిశ్రమలో వాళ్ళు అంత ఖాళీగా ఉన్నారా అని, ఇంకొకరు కాజల్ కు కార్తిక్ కు తెలుగు వచ్చా అని, ఇంకొకరు మీరు చెప్పిన సలహాలు విని ఇప్పటి వరకూ ప్రసాంతంగా గడిచిన మా జీవితాలు ఇప్పుడు కలహాల మయం అయ్యాయి అని, ఇంకొకరు కాఫీ keyboard మీద వలిగిపోయింది అని, ఇంకొకరు కాఫీ పెట్టు కోవడానికి సమయం లేదు అని, ఇంకొకరు కాఫీ అలవాటయ్యాకా నెలసరి ఖర్చులు పెరిగిపోయాయి అని, ఇంకొకరు కాజల్ కార్తిక్ నిజంగా ఇంటికి వస్తారా అని.
ఈ ప్రశ్నలు నిజంగా వచ్చయో లేదో తెలుసుకోవాలి అంటే మీరు వెంటనే కాఫీ తాగకుండా అలవాటుంటే మానేసి వెంటనే ఈ సంఖ్యకు ప్రయత్నించండి దొరికితే నేను వ్రాసినవి నిజమో కాదో తెలుస్తుంది

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.