తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకున్నాను

అందరూ మంచి వాళ్ళు కావాలి అని కోరుకుంటాం కానీ హేళన చెయ్యడం మాత్రం మానం.
స్నేహితుడు: తంలో ధనవంతుడు పేదవాడిని కొట్టి పని చేయించుకునే వాడు, ఇప్పటికీ ఆ స్థితి మారలేదు కానీ ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే అభివృద్ధి పేరు చెప్పి సగం భూమిని పనికి రాని భూమిగా మారుస్తున్నారు.
ఆంధ్రుడు:అదేమిటి పనికిరాని భూమి, అదెక్కడ ఉంది?
స్నేహితుడు: కొన్ని సార్లు మనం చూస్తుంటాము కొన్ని ప్రదేశాలలో పరిశ్రమలు మూతబడ్డాయి అని, మరి అవి మళ్ళి తెరుచుకున్నాయి అని చదవలేదు, అదే కాకుండా పరదేశీ వ్యామోహంతో వాళ్ళ అలవాట్లు గొప్పగా అనిపించడంతో మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము.
ఆంధ్రుడు: ఏమిటా అలవాట్లు?
స్నేహితుడు: మొదట పారిశ్రామికీకరణ, ఇదివరకు రోజులలో మన దేశంలో ఎవరు పండిస్తే వాళ్ళే తినే వారు, లేదా వస్తుమార్పిడి జరిగేది, దీని వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి, వాటిని అధిగమించడానికి కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాం మన జీవన విధానంలో, కానీ అప్పటికీ మనదేశంలో వస్తు వ్యామోహం అంత హెచ్చుగా లేదు, కానీ ఈ పరదేశీ వస్తు వ్యామోహం పెరిగిపోయాకా, బంధుత్వం కన్నా వస్తువు గొప్పది అనే స్థాయికి చేరుకున్నాము. ఇలా వస్తు ప్రీతి పెరిగిపోయి మనిషి ప్రకృతితో బ్రతకడం మరచిపోయాడు. అంతే కాదు అభివుద్ది పేరు చెప్పి జంతువులను ఆహారంగా మార్చుకోవడం అతి ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాడు.
ఆంధ్రుడు:  జంతువును ఆహారంగా మార్చుకోలేదు, ఆహారం దొరకక జంతువును తింటున్నాడు అంతే.
స్నేహితుడు: ఇది ఇంకో అబద్దం, కారణాలు అన్వేషిస్తే మనిషికి అంతః శుభ్రత కన్నా బాహ్య శుభ్రత మాత్రమె ముఖ్యం అనే కాలంలో బ్రతుకుతున్నాడు. ఇంకో అబద్దం మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిది తన తల్లిదండ్రులు పడే కష్టం చూడలేక కష్టపడి చదువుకుని ఇంత పైకి వచ్చాను అని.
ఆంధ్రుడు: అంటే నిజం ఏమిటి?
స్నేహితుడు: ఇంకొకడి అవసరం మనకు ఉద్యోగం అవుతుంది కానీ వాడికి నా సేవ ఎల్లప్పుడూ అవసరం కాదు అనే అభిప్రాయం, అందుకే ప్రతీ ఒక్కరి ప్రయత్నం నేను ఏదో కొత్తది తయారు చేసి ఇస్తే ఎలాగు వస్తుప్రీతి పెరిగిపోయి ఉన్నాడు కాబట్టి కొంటునే ఉంటాడు నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి అని.
ఆంధ్రుడు: అంటే ఉన్నతంగా బ్రతకడం తప్పా?
స్నేహితుడు: ఉన్నతంగా బ్రతకడం అంటే ఎల్లప్పుడూ నువ్వు చేసే పని వల్ల పనీ పాటా లేని వాళ్ళు పెరగడమా లేదా కాలుష్యం పెరగడమా?
ఆంధ్రుడు: అంటే ప్రస్తుతం మనం చేస్తున్న అన్ని పనులు కాలుష్యం పెంచేవే అంటారు!
స్నేహితుడు: కాలుష్యమే కాదు జీవన ప్రమాణాలు దిగాజర్చేవి కూడా, ఉదాహరణకు surrogacy.
ఆంధ్రుడు: మీకు దీని మీద సదభిప్రాయం లేనట్టుంది, దీని వల్ల ఎన్నో పిల్లలు లేని జంటలకు పిల్లలు కలిగారు!
స్నేహితుడు: అది అబద్దం, పిల్లలు లేని జంటలు తయారవుతుంటే కారణాలు తెలుసుకుని ఉద్యోగాలు మానేస్తారు అనే భయంతో, ఇదే కాకుండా దీంట్లో చాలా మోసాలు, దీని వల్ల జీవన ప్రమాణాలు దిగజార్చే సూచికలుపెరిగిపోయాయి .
ఆంధ్రుడు: ఏమిటా మోసాలు?
స్నేహితుడు: నాకు ఈ విషయం చెప్పడం ఎల్లప్పుడూ ఇష్టం లేదు, ప్రజలు ఈ విధానాలు తెలుసుకుని దుష్ప్రయోజనాలు అర్ధం చేసుకుని దూరంగా ఉండట్లేదు వాటిని అలవాటు చేసుకుంటున్నారు, వాళ్ళకు వైద్యులు వంతు పాడుతున్నారు.
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.