నా ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు అని అడవి నుంచీ వచ్చాను అనుకున్నారు కదా!

అనగనగా ఒక చిరుత అది మనుషులకి తారస పడింది మనిషి భయ పడటం మొదలు పెట్టాడు, జంతువులతో మాట్లాడే శక్తి ఉన్న ఒక మనిషి ఆ చిరుతను పలకరించాడు 

చిరుత: ఏమిటి ఇలా వచ్చావు?

మనిషి: నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నవో తెలుసుకుందాం అని.

చిరుత: నిన్నటి వరకూ ఇక్కడే తిరిగాను ఈరోజు తిరిగితే తప్పు ఏమిటి?

మనిషి:అదేమిటి ఎప్పుడో ౩౦ సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ రోజు నువ్వు తారస పడి వీళ్ళను భయ పెడుతున్నావు!

చిరుత: సాక్ష్యం ఏమిటి?

ఆ మనిషి కొన్ని కాగితాలు తీసుకుని చూపించాడు, అప్పుడు చిరుత ఒక్కసారిగా అరిచింది 

చిరుత: ఓరీ మూర్ఖుడా ఈ ఊరి పేరు అది కాదు అసలు ఇది ఊరు కాదు, ఆ ఊరు ఇక్కడ నుంచీ రెండు జిల్లాల అవతల ఉంది ఆ ఊరులోని కాగితాలు ఇక్కడకు తెచ్చి ఇక్కడ నీకు చూపించారు.

మనిషి: అయితే ఇక్కడ చెట్లు ఉండాలి కదా ఏమైనాయి?

చిరుత: మనిషి అభివృద్ధి పేరిటి చేస్తున్న వినాశనము ఇది.

మనిషి: అంటే?

చిరుత: ౩౦ రోజుల క్రితం ఒక Bulldozer వచ్చింది చెట్లను ప్రజలు యంత్రాలతో కోసి ఆ Bulldozer సాయంతో తరలించారు తరువాత ఇక్కడ వీళ్ళు గుడిసెలు వేసుకున్నారు, ఇప్పుడు ఈ స్థలం నాది అంటున్నారు, వాటికి పత్రికల తోడూ 

మనిషి: అంటే వీళ్ళు చెబుతున్నది అబద్దమా?

చిరుత: అసలే ఆకలితో ఉంటే నీ ప్రశ్నలు ఏమిటి?

అని ఆ మనిషిని తినేసింది!

ఇప్పటికీ ఆ చిరుత చెప్పింది నిజమో మనిషి చెప్పింది నిజమో తెలియక చిరుత నే నిందిస్తూ ఉన్నాను.............--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."