రైతులకు సాయ పడని ఆధార్ పత్రం

దీనికి సమాధానం నందన్ నిలేఖనీ ఇవ్వాలి, ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్న ఆధార్ ప్రక్రియ.
ఆధార్ నాకు అర్ధం అయ్యింది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోకుండా చేస్తుందా అంటే లేదు మా ఊరులో దానికి సంబంధించిన దరఖాస్తు పత్రాలు అమ్ముతున్నారు. ఇక ఆధార్ దరఖాస్తు పత్రాలు అందజేస్తున్నది VRO లేదా MRO వాళ్ళకు కనీసం ఊరు జనాలు ఎక్కడ ఉంటారో తెలియదు అలాంటిది వాళ్ళు ఎలా ఇస్తారు పత్రాలు?
ఇక ఇంకో హాస్య సన్నివేసం మన ప్రభుత్వం ఆధార్ సంఖ్యతో నువ్వేసిన పంటలు నమోదు చేయించొచ్చు అనే కొత్త పధకం మొదలు పెడుతుంది అంటే ఏమిటి రైతులు వాళ్ళు వేసిన పంటలు నమోదు చేయించుకోవాలి అంట ఇది కూడా మళ్ళీ private భాగస్వామ్యమే, అసలే విద్యుత్తు ఉండట్లేదు మరి ఎలా గణన యంత్రం మీద నమోదు చేస్తారు?
ఇలాంటి అర్ధం కాని విషయాలు చాలా ఉన్నాయి
1. విద్యుత్తు రైతులకు ఇవ్వడానికి లేదు కానీ గణన యంత్రానికి ఇస్తారంట.
2. రైతులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు కానీ నందన్ నిలేఖని కు ఇవ్వడానికి ఉంటాయి.
3. ఆధార్ ఇప్పుడు నాది అని నిరూపించడానికి మళ్ళీ ఇంకో విధ్యుత్ వృధా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది ప్రభుత్వం.



No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.