కొత్త చదువుల అపాయం తెలుసుకునే అబద్దపు అభివృద్ధికి దూరంగా ఉన్నారా సీమంధ్ర ప్రజలు?

దీన్ని ఇంకో రకంగా అబద్దపు చదువు చేసిన వినాశనాలకు దూరంగా ఉన్నారా అని కూడా అనుకోవచ్చా!
నిజానికి అభివృద్ది మాటున జరిగిన నిరుపయోగత నుంచీ ఆంధ్రా ప్రజలు దూరం కోరుకున్నారు అని అనడం కంటే ఆంగ్లేయులు తెచ్చిన చదువుల నష్టాల నుంచీ తరతరాల చదువుల వ్యక్తులు మన దేశాన్ని కాపాడుతున్నారు అనడం సబబు.
చదువు నాకు ఏమి నేర్పించింది అని ఆలోచిస్తుంటే ఉపయోగ పడని సామాన్లు తయారు చేసే అభివృద్ది అనే అబద్దాన్ని చేతికి ఇచ్చింది.
నిజానికి గత కొంతకాలంగా హైదరాబాద్ అభివృద్ది గురించి చర్చలు జరగడం చూసాను, దాంట్లో మీరు రాక మునుపే హైదరాబాద్ అభివృద్ది చెందిది మీకు కొత్త రాజధాని చేసుకునే డబ్బులు లేకపొతే మేము మా రాజధానిని ఉమ్మడి రాజధాని చేసాము ఇప్పుడు మీరు దాన్ని కల్మషం చేసారు.
అసలు చరిత్ర ఎరిగి మాట్లాడుతున్నారా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది
హైదరాబాద్ ను రాజధానిగా నిజం లు ఎంచు కోవడానికి కారణం
1. మిగిలిన ప్రదేశాలలో పంటలు పండించడం చేసే వారు - కాబట్టి ఆ ప్రదేశాలలో రాజధాని కడితే పన్ను కట్టే వాళ్ళు తగ్గిపోతారు అని.
2. భౌగోళికంగా చూసుకున్నా హైదరాబాద్ అప్పటి నిజాం సంస్థానానికి కొంచం మధ్యలో ఉంది.
ఇక ఆంద్ర రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు అని చూద్దాం
నిజాం సంస్థానాలే కాదు అన్ని సంస్థానాలు అదే పంథాలో ఉన్నాయి అప్పట్లో పన్ను కట్టేది కేవలం పాడి పంటల మీద వచ్చిన డబ్బుల నుంచీ వ్యాపారం నుంచీ. మరి అలంటి ప్రదేశాలలో కట్టడం అంటే మాటలా?
ఇవే కాకుండా ఆంధ్రా ప్రాంతంలో కొండలు కొంచం తక్కువ చాలా దూరాల నుంచీ కొండలు తెచ్చి సంస్థానం ఏర్పరచాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని పైగా ఆ ధనం ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ధనం అని కొందరు రాజులు అనుకునే వారేమో ఇంకోతమంది భోగ భాగ్యాలకు ఖర్చు పెట్టారేమో.
ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటుంటే మనం కొత్త రాజధాని ఏర్పరుచుకోక పోవడమే మేలు అనిపిస్తుంది..........