రెండు రకాలుగా దంచుదాం అనుకున్నాడు రెండు రకాల జనాల బాధలకు మూల పురుషుడు అయ్యాడు!

ఇది నేటి తెలివైన వాళ్ళము అని విర్ర వీగుతున్న వాళ్ళ గురించి!
తెలిసి తెలియక తప్పులు చెయ్యడం దాంతో అటు వాళ్ళ కోసం కష్ట పడుతున్న వాళ్ళను ఇటు వీళ్ళను నమ్మి మోసపోయిన వాళ్ళు.
జనాల బుద్ది వాళ్ళ పనులు ఎవరైనా చెయ్యడం జనాలకు ఇష్టం కాబట్టి ఒక అతి తెలివైన వాడు డబ్బు పిచ్చి ముదిరి జనాలకు తక్కువ ధరకు లభించే వస్తువు తయారు చేస్తాను అన్నాడు. జనాలకు అందించాకా కాదు దీనికన్నా ఇది ఉత్తమ మైనది అని ఇంకొక వస్తువు అందజేశాడు, తరువాత ఇతను డబ్బు పని చెయ్యకుండా సంపాదించడం చూసి ఇంకో తెలివైన వాడు వాడి వస్తువులు జనానికి హాని చేస్తాయి అని చెప్పి తను ఇంకో వస్తువు తయారు చేసాడు ఇంతలో జనానికి తెలివి నశించింది ఎంతగా అంటే, తన శరీరం శుభ్రం చేసుకోవడానికి తన చేతులు ఉపయోగించలేనంత అన్నమాట(steam bath లాంటివి). ఇక దీన్ని అభివృద్ది అని ఇంకొకరు చెప్పడం దాన్ని నమ్మడం ఆ తరువాత తన మెదడును వాడటం మానేసి ఇంకొకడి మెదడును అరువు తీసుకునే స్థాయికి చేరుకున్నాడు(computer). ఇక అరువు తీసుకున్నకా వాడి కళ్ళతోనే చూడటం మొదలు పెట్టాడు(video chatting), ఇక అరువులు అరువులు మొదలు పెట్టాడు.
ఇంతలో తెలివైన బద్దకస్తుడు(industrialist మరియు అభ్యుదయ వాది) వెనక నుంచీ భూమిని సారం లేకుండా చెయ్యడం మొదలు పెట్టారు, industrialist గురించి అందరికీ తెలుసు మరి అభ్యుదయ వాది ఎలా నాశనం చేసాడు అనే కదా మీ ప్రశ్న, సమయాన్ని ఇంకొకడి తప్పులు చూపించడానికి వృధా చెయ్యడం నాలాగా లేదా అవసరం లేని podiums పెంచి లాంటివి.
కొన్నిసార్లు పత్రికలు తమ రచనలకు తామే వ్యతిరేకంగా వ్రాస్తాయి, ఉదాహరణకు మచిలీపట్నం ఓడరేవు. ఈ ఉదాహరణ ఎందుకు తీసుకున్నాను అనే కదా మీ ప్రశ్న, మన రాష్ట్రంలో అల్ప పీడనాలు రావడానికి కారణం ఏమిటి అని ఒక పత్రిక వ్రాసింది కృష్ణా గోదావరి నదులకు వరదలు ఎక్కువ దాని వల్ల నీరు బంగాళాఖాతం లోకి చేరి ఒక్క సారిగా వాతావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది(అది కొంత వరకు అబద్దం - నిజానికి చెరువులు పూడ్చి మనమే నీటిని అంతా సముద్రంలో చేరేలా చేస్తున్నాము.),  ఇవే కాకుండా చెట్లు కొట్టెయ్యడం కూడా ఒక కారణం అని కూడా వ్రాసింది. కానీ అదే పత్రిక తన తరువాత సంపుటిలో మచిలీపట్నం దగ్గర ఓడరేవు కట్టించాలి అని వ్రాసింది, కానీ అక్కడ ఓడ రేవు కట్టాలి అంటే చెట్లు కూల్చాలి అని ఆ పత్రికకు తెలియదా?
ఇలాంటివే మనం అభివృద్ది అనుకుంటున్నాం! 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.