ఉచితంగా తినిపిస్తుంటే

అనగనగా ఒక ముసలోడు ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు,వాడికి ఇష్టం వచ్చినట్లు తినిపించిన ఒక అమ్మాయి వాడిని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలి అనుకుంది, ఇది ఈ తరం కన్యాశుల్కం.
ఆ తరం కన్యాశుల్కం లో అమ్మే వారు, ఈ తరం తమను తాము అమ్ముకుంటున్నారు దానికి కారణాలు
1. డబ్బు. 
2. హోదా.
ఆ అమ్మాయి మూడు పెళ్ళిళ్ళ ముసలోడి కూతిరితో స్నేహం చేసి అతని ఇంట్లో చేరింది.
మరి ఆ మూడు పెళ్ళిళ్ళ ముసలోడికి కొత్త మీద మోజు దాంతో ఈ అమ్మాయితో చనువుగా ఉండటానికి ప్రయత్నించే వాడు, అదే ఆ అమ్మాయి కోరుకుంది అలా కాలం గడిచింది, కొన్ని రోజులకు మూడవ పెళ్ళానికి విడాకులు ఇచ్చేశాడు, ఇది అతన్ని ఆ స్థానంలో కూర్చో పెట్టిన వాళ్ళు బయటకు రానివ్వలేదు, ఎలాగంటే సామ దాన బేధ దండో పాయలతో.
ఎవరితో సామ గుణం అవలంబించారు అంటే - వకాల్తా పుచ్చుకున్న వాళ్ళతో
ఎవరితో దాన గుణం(అంటే ఇక్కడ లంచం అని వ్రాయలేక ఇలా వ్రాసాను) - పత్రికలతో
బేధ వైరి వర్గంతో - వైరి వర్గంతో మీరు నెత్తిన ఎక్కించుకున్న వాడు మోసాలు చేసాడు అవి బయట పెడతాం అని బెదిరించి.
దండోపాయం నిజాయితీగా ఉన్నవారిని - ఇది ఎల్లప్పుడూ జరిగేదే.

తరువాత బాహాటంగా కాకపోయినా నెత్తిన ఎక్కించుకున్న వారి సమక్షంలో పెళ్ళి చేసారు.
ఇక ముసలోడికి మొదటి రాత్రి అది ఎప్పటికీ జరగలేదు ఎందుకంటే ఆ అమ్మాయికి కావాల్సింది కేవలం పరపతి హోదా డబ్బు కానీ పిల్లలు కాదు.
కాలం గడిచింది ఆ ముసలోడి కూతురు నెల తప్పింది, పెళ్ళి కాకుండా నెల తప్పేసరికి వాడిని నెత్తిన ఎక్కించుకున్న వారిలో ఒకడు ఆ పాపం చేసింది నేనే అని చెప్పాడు, మిగిలిన వారు వాడిని కొట్టారు, దాంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.

పెరిగిన పరిజ్ఞానము తో DNA tests చేయిస్తే భయంకరమైన నిజాలు తెలిసాయి, తన భార్య తండ్రి ఆమెకు తాత అవుతాడు అని తెలిసి నిర్ఘాంత చెందాడు. ముసలోడికి తెలిసినంత వరకూ తన భార్యకు(Latest) సహోదరులు ఎవరూ లేరు, ఇక కన్యాశుల్కం నాటకం గుర్తుకు వచ్చి అతని భార్యకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే తెలిసింది ఏమిటి అంటే పెళ్ళి జరిగిన కొన్ని నెలల వరకూ అతను మగాడు అని తరువాత లింగమార్పిడి చేయించుకున్నాడు అని.

ఇప్పుడు అతనికి రెండు చేదు వార్తలు
1. అతని కొత్త భార్య గర్బవతి
2. అతని కూతురు భర్త తన భార్య


మన ప్రస్తుత సమాజం ఇలా అవుతుందేమో అని భయమేస్తుంది.