నా వరకూ నేను చేసిన తప్పులు

నేను చెయ్యక్కర్లేదు అని అనుకోవడం.
వాటికి కారణాలు అనేకం -
నేను పన్ను చెల్లిస్తున్న కాబట్టి నా తోటి వాడిని కాపాడాల్సిన పని లేదు, ఎందుకంటే నేను వాడికి సాయం చేసినా ప్రభుత్వం నా పన్ను తగ్గించదు నన్ను ఎవరూ గుర్తించరు.
కులం అనే కట్టుబాటు ఏర్పాటు చేసుకున్నది మనం మన హితం కోరుకునే వారితో ఉంటాము అని, కానీ కొంతమంది అభ్యుదయ వాదులు(అని అనుకుంటున్న) చెబుతున్న అబద్దాలు నమ్మి మనం అన్న భావాలను కోల్పోతున్నా ఆ అబద్దాలు నమ్ముతున్నాం.
కట్టుబాట్లు కారణాలు ప్రచురించ లేదు కాబట్టి నమ్మడం మానేసి డబ్బు వృధాగా ఖర్చు పెడుతున్నా వాటిని ఆచరించం.
డబ్బు అనే ప్రపంచంలో డబ్బే పరమావధిగా బ్రతుకున్నా
ఎక్కువ వృధా అవుతుంది అని తెలిసినా mutual funds share markets లో పెట్టుబడులు పెడుతున్నాను. నాకోసం ఎవడో పండిస్తున్నాడు అని నా దగ్గర పంట పొలాలను నాశనం చేస్తున్నాను. ఇక ప్రకృతి నాశనం అవుతుంది అని తెలిసినా plastic ని వాడటం మానట్లేదు, ప్రకృతి ఋతు క్రమాల వల్ల అడ్డదిడ్డంగా బ్రతక లేక పోతున్నాను కాబట్టి wisper లాంటి వాటిని వాడించి నాశనం చేయిస్తున్నాను.
ఇన్ని తెలిసి కూడా నేను ప్రకృతి నాశనం కోరుకుంటున్నాను.