తర తరాలుగా తప్పు చేస్తున్న వాడిని మనం తెలుసుకోవట్లేదు

ఈ వ్యాఖ్య +AAP గురించి, ఇక్కడ చిత్రమైన అర్ధం కాని విషయం ఏమిటంటే తప్పు చేసిన వ్యక్తిని దండించే అధికారం ఉండి కూడా ధర్నా చేస్తున్న అతి మేథావి ఆలోచనల గురించి.
మత్తు పదార్థాలు అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోలేదు అని వెళ్ళి కేంద్ర home minister ఇంటి ముందు ఎందుకు ధర్నా చేస్తున్నాడో అంతకన్నా ఎక్కువ అర్ధం కావట్లేదు.
మొన్నటి వరకూ అధికారం లేదు కాబట్టి ధర్నా చేస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఉంది అయినా ధర్నా చెయ్యడంలో అర్ధం ఏమిటి?
అంటే తనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు తనని blackmail చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ పెద్ద తలకాయలను blackmail చేస్తే సరిపోతుంది అని ధర్నా చేస్తున్నాడా?
లేక ప్రజలను మభ్య పెట్టడానికా?
అయినా క్రేజివాల్ ఒక్క విషయం మరచి పోయాడు అనుకుంటున్నాను అదేమిటంటే తానూ ఒక వ్యవస్థను నడపాలి అని, అది ఆయనకు గుర్తు చెయ్యాలి.
2014 ఎన్నికలు అతని కోసం కాదు అని గుర్తించాలి.