మనం - చాలా మంచి చిత్రం

జీవితంలో కొన్ని తప్పులకు శిక్ష మరుజన్మలో ఉండొచ్చు అన్నట్టు
చిత్రం ఆద్యంతం అమ్మ ఎప్పటికీ అమ్మే అని, నాన్న ఎప్పటికీ మార్గ దర్శకుడే అని చూపించారు, ఒక్కటే వెలితి రెండు జీవితాలు రెండు తప్పులు రెండు పునః జన్మలు, కానీ ఒక్కటే ప్రేమ ఒక్క జంటే బాధ్యతాయుక్తంగా ఉంది రెండవ జంటలో అమ్మ మాత్రమే ప్రేమను చూపించింది.
రెండు సమాజాలు చూపించిన చిత్రం.

నవ్వుకోవచ్చు ఆస్వాదించ వచ్చు జీవించ వచ్చు.

ఒక్క మాటలో చెప్పాలి అంటే నాగార్జున పాత్రే చిత్రానికి ప్రాణం గా నిలిచింది, ఇక అక్కినేని గారి పరిచయం బాగుంది, అమ్మగా సమంత శ్రియ బాగా చేసారు.
చిత్రంలో నాకు ఒక పాత్ర పరిపూర్ణంగా లేదు అనిపించింది అది చేసింది నాగచైతన్య.
ఇక నాగేశ్వర రావుగారి పాత్ర 3 తరాలు నిలిచిపోయే పాత్ర!

అమ్మ అనిపిలిస్తే నీ పక్కనే ఉంటాను అనే అమ్మకోసం తీసిన చిత్రం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.