రాజధాని లేని రాష్ట్రం కావాలి!

అదే జరిగితే అపారమైన అటవీ సంపత్తి నశించదు, ఎన్నో రెట్లు ఉద్యోగాలు వస్తాయి లేదా ఉన్నవి నిలబడతాయి!

మరి అందరికీ అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది
మరి సభ ఎక్కడ పెడతారు, దీనికి చాలా సులభమైన సమాధానం ప్రతీ జిల్లాకు ఒక Collector office ఉంటుంది అందులో నుంచీ ఆ జిల్లాలోని MLA లు Video Conference ద్వారా తమ ఊరి అభివృద్ది గురించి చర్చించు కుంటారు!
పైగా ఈ పద్దతి వల్ల IT ఉద్యోగాలు నిలబడతాయి, ఇక ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణానికి పెట్టె ఖర్చుతో పాత భవనాలు బాగు చెయ్యచ్చు, కొత్త కొత్త పద్దతుల ద్వారా ఇప్పుడు ఉన్న గిడ్డంగులలో ధాన్యం నిల్వ చెయ్యవచ్చు.
ఇక ప్రజా ప్రతినిధులు తాము సారధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో ఉండాలి అన్న ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది!

మరి ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే, ఇంకా ఇక్కడ ఇంకో సౌలభ్యం కూడా ఉంది, ప్రజలకు TV సంస్థలు చెప్పే వాళ్ళ భాష్యం లో పధకాల భారి నుంచీ దూరం అవుతారు! ఎందుకంటే Video conferenceను record చేస్తాం గా అది ప్రజలు ఎప్పుడైనా వినొచ్చు!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.