సింగరేణీ లో బొగ్గు ఉత్పత్తి అవుతుంటే రామగుండం తరలించకుండా, ఒరిస్సా నుంచీ బొగ్గు దిగుమతి చేసుకోవడం గురించి అడిగావా?(తస్మాదపరిహార్యేర్ధే - ఏడవ భాగం)

oats తినకండి గోవిందా!
అందులో gluten ఉంటుంది గోవింద!
జీర్ణ శక్తిని హరిస్తుంది గోవిందా!
oats తినకండి గోవిందా
ఇక ఇప్పుడు రామాయణ కథా కాలక్షేపం గోవిందా!

రామాయణ కథా కాలక్షేపం పూర్తయిన తరువాత మరలా చర్చ మొదలయ్యింది. అగమ్యి మళ్ళీ ప్రశ్నించాడు మీరు ఎక్కడికి వెళ్ళారు అని. స్వామి అదే చెప్పారు తస్మాదపరిహార్యేర్ధే.
భారతీయడు:మీరు మిగిలిన వారిని christians గా మారుస్తున్నారు అన్నారు, అంటే Mother Therissa సేవ చెయ్యలేదా?
వర్తకుడు:నువ్వు వెళ్ళి చూసావా?
భారతీయడు:లేదు, కానీ వార్తా సంస్థలు చూపిస్తున్నాయి కదా!
వర్తకుడు: వార్తా సంస్థలు అన్ని హిందూ సంస్థలు చెడ్డవి అని ప్రచారం చేస్తున్నారు అది ఎలా నమ్మవో ఇదీ అలాగే నమ్ముంటావు. ఇక నిజం ౩౦౦ గదులు ఉన్న ఒక ఆసుపత్రి అది, అక్కడ ఉన్న వారి పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారికంటే దయనీయంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్నైనా అత్యవసర విభాగాలు ఉంటాయి, అక్కడ అత్యవసర విభాగం అని ప్రత్యేకంగా ఉండదు, అక్కడ ఎంత మంది వైద్యులు ఉన్నారు. ఇంకా మనం చర్చ నుంచీ దారి మరలుతున్నాము. వాళ్ళు మళ్ళీ east India సంస్థ అనుసరించిన పద్దతులే అనుసరిస్తున్నారు. అందులో మొదటిది నీ శత్రువుని ధనవంతుడిని చెయ్యడం, లేదా నీ శత్రువు తెలివి తేటలను నీ మీద ఉపయోగించి నువ్వు ఓడిపోయాకా నీ సాయం తీసుకుని వాడి మీద గెలవడం. ఇది యుద్దనీతి అని అనుకున్నావు కానీ కాదు,నిన్ను నీ చేతిలో చంపే ఆయుధం.
ఇక నువ్వు ఏనాడైనా అడిగావా
౧. వాళ్ళ దేశంలో గాజు పాత్రలో పాల రవాణా చేస్తారు, కానీ మనదేశంలో plastic packets.
౨. ఏనాడైనా అడిగావా నువ్వు కొన్న cellphone దాని కాల పరిమితి పూర్తయ్యాకా ఎక్కడ మార్పు చేసి తిరిగి పనిచేసే వస్తువుగా మార్చవచ్చో?
౩. ఏ రోజైనా నిన్ను నువ్వు ప్రశ్నించు కున్నవా, నువ్వు వాడి పడేసిన పాత Electronic items ఏమవుతున్నాయి?
౪. సింగరేణీ లో బొగ్గు ఉత్పత్తి అవుతుంటే రామగుండం తరలించకుండా, ఒరిస్సా నుంచీ బొగ్గు దిగుమతి చేసుకోవడం గురించి అడిగావా?
౫. అదే సింగరేణీ బొగ్గు ఒరిస్సా మీదుగా తరలించడం గురించి అడిగారా?
౭. ఉత్పత్తి జరిగుతున్న ప్రదేశంలో కూడా ఎడారిలో అమ్మే ధర గురించి ప్రశ్నించారా?
౮. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో రహదారుల మీద ఆదాయం పడిపోతుంది అని కొత్త ధూమ శకటాలు వెయ్యనప్పుడు అడిగారా?
౯. సాగు భూములు బీడు భూములుగా అమ్ముకున్న వాళ్ళ కుటుంబాన్ని యుద్ద వీరులుగా చూపినప్పుడు ప్రశ్నించారా? ఆ పత్రికకు చరమగీతం పాడారా?
౧౦. యంత్రం పుట్టినదే ధర తగ్గించడానికి అలాంటి యంత్రం మీద తాయారు చేసిన వస్తువుకు ఎక్కువ ధర చెల్లించడం గురించి ప్రశ్నించారా?
౧౧. ఒక పక్క చేతిని నమ్ముకున్న వాళ్ళు ఆ చేతికి ఆహారం అందక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆపారా?
(సశేషం.....)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.