తప్పు చేసిన వాడిని కొట్టరు-ఎందుకంటే వాడిని కొడితే డబ్బులు రాలవు.

రామాయణ కథా కాలక్షేపం పూర్తయిన తరువాత మరలా చర్చ మొదలయ్యింది. అగమ్యి మళ్ళీ ప్రశ్నించాడు మీరు ఎక్కడికి వెళ్ళారు అని. స్వామి అదే చెప్పారు తస్మాదపరిహార్యేర్ధే.
మనందరి కోసము: సింగరేణీ లో బొగ్గు ఉత్పత్తి అవుతుంటే రామగుండం తరలి...:
౧౧. ఒక పక్క చేతిని నమ్ముకున్న వాళ్ళు ఆ చేతికి ఆహారం అందక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆపారా?

భారతీయుడు:మీరు అసమానతలు తయారు చేసారు, కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు.
వ్యాపారి:నిజమా?నాకు తెలియదు. మీ దృష్టిలో సమానత్వం అంటే అందరూ ఒకేలాగా తినడమా?
భారతీయుడు:కాదు అందరూ ఒకేలాగా బ్రతకడం.
వ్యాపారి:అంటే ఒకడికి రోగం వస్తే వాళ్ళు పస్తులు ఉండాల్సి వస్తే అందరూ పస్తులు ఉండాలా.
భారతీయుడు:అలా ఎందుకు అవుతుంది?ఎవరికి కావలిసినంత వారు తీసుకోవడం.
వ్యాపారి: మేము కొంచం తెలివి తక్కువ వాళ్ళం తెలుగులో చేప్పగలరా, ఎవరికీ ఎంత కావాలో అంత తీసుకోవడం అంటే.
భారతీయుడు:అంటే నేను తినగాలిగినంత మాత్రమే నేను తీసుకోవడం.అంత కన్నా ఎక్కువ తీసుకోకపోవడం.
వ్యాపారి:ఇంకో పక్కన నువ్వు చేసిన పనికి తగినంత ఇవ్వాలి అంటావు, అన్నీ నీ మాటలే.
భారతీయుడు:మరి లేకపోతె ఎలాగ?
వ్యాపారి:సరే ఆ విషయానికే వద్దాం, నీళ్ళు లేని చోట పంట పండించడానికి అయ్యే ఖర్చు నీటి లభ్యత ఎక్కువ ఉన్న చోట ఒకేలా ఎలా ఇవ్వగలరు?
భారతీయుడు:కాలికి తలకి లంకె ఎలా పెడతారు?
వ్యాపారి:సరే కాలికి కాలికే లంకె పెడదాం, ౮ గంటలు నిలబడి రక్షణ చేసిన వాడికి ౮ గంటలు పంటలు కాపాడిన వాడికి జీతం ఎలా ఇవ్వాలో చెప్పండి?
భారతీయుడు:సమాధానం లేని ప్రశ్న అనే కదా ఈ ప్రశ్న.
వ్యాపారి:కాదు సమానత్వం గురించి తెలుసుకుందాం అని. సరే సమానత్వం గురించి ఒకరి జీవితంలో తెలుసుకుందాం, నాకు తెలిసిన ఒక వ్యక్తి ధనవంతుడు, కొంచం లావుగా ఉంటాడు.
భారతీయుడు:అంటే ధనవంతులు లావుగా ఉంటారు అనా మీ ప్రశ్న?
వ్యాపారి:అదే ఆపమన్నాను, నీలాంటి వాళ్ళ వల్ల అతను జీవితం కోల్పోయాడు. వాడికి డబ్బు ఉందని అహంకారం లేదు, ఎవరు అడిగినా ఖాళీ చేతులు చూపేవాడు కాదు, ఒక రోజు ఒక ఊరి ప్రజల ఆకలి చావులు గురించి తెలుసుకుని, ఆ ఊరి ప్రజలకు సాయం చెయ్యాలి అని, తన ఆస్తులు అమ్ముకుని, అక్కడికి పయనం అయ్యి ఒకరిని నమ్మి అక్కడ ఆశ్రయం పొందాడు.
భారతీయుడు:అంటే ఇక్కడ పొట్టలు కొట్టి అక్కడి ప్రజలను బాగు చెయ్యాలి అనుకున్నాడా?
వ్యాపారి:అప్పుడే సమానత్వం మరచిపోయావు.బాగుంది. సమానత్వం అంటే అర్ధం మరచిపోకు. వాడి దగ్గర ధనం ఉంది అని ఆ ఊరి ప్రజలకు తెలిసింది, అక్కడకు వచ్చిన వెంటనే కొంత మంది వాడి ఆస్తి దోచుకోవాలి అని విష ప్రచారం మొదలు పెట్టారు, వాడు వట్టి తాగుబోతు అని.
భారతీయుడు:ప్రజలు ఎలా నమ్మారు? అయినా ప్రజలకు తెలియదా వాడు తాగుబోతు అవునో కాదో!
వ్యాపారి:ఎవరు లావుగా ఉంటె జనాలను దోచుకున్నవాడు అని నమ్మే వారా లేక పొతే లావుగా ఉంటే తాగుబోతువా అని ప్రశ్నించే వారా?
భారతీయుడు:అదేమిటి అలా అంటావేమిటి, ప్రజలు గుర్తించ గలరు.
వ్యాపారి:నువ్వు ఎంతమందిని అడిగావు? ఒక్కసారి ఆలోచించుకో. నేను వాడి జీవితం లో జరిగినవి చెబుతున్నాను కానీ కల్పించట్లేదు.
అతను చాలా మంచి పథకాలతో వచ్చాడు, మొదటిగా ఆ పరిస్థితికి కారణం అక్కడ చెరువులు లేవు, సరే చెరువులు తవ్విద్దాం అని పూనుకున్నాడు. ఎక్కడైనా కొందరు చెడ్డ వాళ్ళు ఉండటం సహజం, వారికి దినానికి ఇచ్చే జీతంలో కొంత తగ్గించి ఇవ్వడం చేసి లేదా దారి మళ్ళించడం. మొత్తానికి చెరువులు తవ్వించాడు - అసలు ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు పెట్టాడు.
ఈలోగా ప్రజల మనసులో వీడు మందు బానిస ముద్ర పడిపోయింది, మంచి చేసాడు అన్న దానికన్నా వీడిని దూరం చెయ్యడం మొదలు పెట్టారు, దాంతో వీడు వస్తున్నాడు అంటే ఈసడించుకోవడం, ఎలాగైనా పంపించేయాలి అని కోరుకున్నారు. దాంతో వాడికి జీవితం మీద విరక్తి పెరగడం, ఎంత మంచి చేస్తున్నా నమ్మని స్థాయికి వెళ్ళిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.
వీడిని నమ్మక పోవడానికి కారణాలున్నాయి, అందులో కొన్ని చెరువులు తవ్వించాడు కానీ చెరువుల చుట్టూ స్థలం ఆ ఊరిలో కొందరు ఆ చుట్టూ ఉన్న స్థలాలు కొని వాటిని అమ్మడం మొదలు పెట్టారు. కానీ జనాలకి చెప్పడం మాత్రం ఆ వ్యక్తి యొక్క ఆజ్ఞ మీదే ఇలా చేసాం, మేము కేవలం అతని నమ్మక భటులం. ఆ డబ్బంతా అతనిదే అని నమ్మ బలికారు.
భారతీయుడు:నువ్వు ఇది తెలంగాణా వ్యతిరేకివి కాబట్టే చెబుతున్నట్టు ఉంది.
వ్యాపారి:లంకె వెయ్యడంలో మీకు మీరే సాటి, నేను ఇది జరిగిన ప్రదేశం మీకు చెప్పలేదు, అది Bihar లో ఒక ప్రదేశం.
భారతీయుడు:ఇంకొకడు ఉన్నాడు బీహారీలను చెడ్డ వాళ్ళగా చూపించే వాడు, చూడండి, ఎక్కడో Bihar లో జరిగింది వీడికి తెలిసిందట.
వ్యాపారి:అదే పూర్తిగా తెలుసుకోకుండా మీ అభిప్రాయాలు వ్యక్త పరచడమే కదా మీ అభిప్రాయం. అతని మంచితనం తెలుసుకుని అతనిని అక్కడ నుంచీ కాపాడిన అభయ్ ఆనంద్ నాకు చెప్పాడు.
అభయ్ ఆనంద్: हां मै हीजो उसको इदर वापस लाया।वो हमेशा ये व्यपारीके बारेमे कहता रहताहै। और एक दिन मुझे ऐसा लगाकी इसका दोस्त पागल होने वाला जैसे लगा इसलिए मैंने उसको वापस लाया।ఆయన చెప్పింది నిజమే అది నా కాళ్ళ ఎదురుకుండా జరిగింది.
వ్యాపారి:ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉంది, అతను ఈ ఆశ్రమం నిర్మాణంలో వ్యక్తి, ఆటను రాక మునుపు ఇక్కడ కొంచం అస్తవ్యస్తంగా ఉండేది అతను దగ్గార ఉండి అన్నీ సక్రమమం చేసాడు. ఒక్కోసారి మంచి చేసే వారిని చేయ్యనివ్వకపోవడం మన తప్పు.
మీలో సమానత్వం కోరుకునే వాళ్ళలో కొంతమంది పెద్ద వాళ్ళని హేళన చేస్తే వాళ్ళ మిగిలిన స్నేహితులు కూడా చెయ్యాలి అని కోరుకునే వారు, పెద్ద వాళ్ళని खडूस అని సంబోధించిన Advertisement సంస్థను ఇంకా వాడుతున్నారు.
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.