కలిసి ఉంటే కలదు సుఖం - విడిపోతే Super Markets (తస్మాదపరిహార్యేర్ధే - ఆరవ భాగం)

తరువాత రోజు ఉదయం మళ్ళీ చర్చా గోష్ఠి మొదలయ్యింది.
కలిసి ఉంటే కలదు సుఖం - విడిపోతే Super Markets (తస్మాదపరిహార్యేర్ధే - అయిదవ భాగం)
స్వామి:ఒకప్పుడు పాలు ఉదయం సంధ్యా సమయంలో తాగడం అలవాటు, నేడు కొంతమంది ప్రజలకు రుచులు బాగా అలవాటయ్యి పాలు తాగడం కన్నా వేరేవి తాగడం మొదలు పెట్టారు, ఇంకొంత మంది ప్రజలు పాలల్లో వెన్న శాతం ఎక్కువ కాబట్టి పాలు తాగడం మానేశారు, ఇంకొంతమంది పాలల్లో వెన్న తీసిన పాలు తాగే వారు మరి ఆ వెన్న ఎవరు ఉపయోగిస్తున్నారు? అది వ్యర్ధం కదా, పోనీ కొనలేని పోషక విలువలు తక్కువ ఉన్నవారికి ఇచ్చారా ఉచితంగా అంటే లేదు, అలా చేస్తే ప్రజలు శక్తి వంతులు అవుతారు, రాజకీయ నాయకులకు పోషక విలువలు గురించి ఉపన్యాసం ఇచ్చి ప్రజలను votes గా మార్చుకునే అవకాసం పోతుంది.

భారతీయుడు:మరి గొడవపడుతూ కలిసి ఉండాలి అంటారా?
స్వామి:గొడవకు మూల కారణం ఏమిటి? ఇంకొకరు తమకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు అని ఈర్ష్య లేదా తక్కువ సంపాదిస్తున్న వారు అంటే చులకన. ఈ రెండూ దూరం చేసుకుంటే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. చెయ్యగలమా? లేదు, అలా మనం మారినా సమాజంలో కొందరు మార నివ్వరు. ఎందుకంటే మీరు కలిసి ఉంటే వాళ్ళకు లాభాలు రావు కదా, కనీసం విడిపోకుండా ఉండడానికి ప్రయత్నించండి.

భారతీయుడు:అంటే కలిసి ఉంటే అనీ సుఖాలే అంటున్నారు మరి America లో ఎంతమంది విడిపోతున్నారు? అయినా సుఖంగా లేరా?
స్వామి:లేరు, తిరిగి తిరిగి మనం అక్కడికే వస్తాము, కొంతమంది చెడ్డవారు చేస్తే మంచి ఎలా అవుతుంది? అక్కడి రాజ్యాంగం అలా రూపొందించారు, కలిసి ఉంటే పెళ్ళిళ్ళు తగ్గుతాయి దాని వల్ల వాళ్ళ ఆలయాలకు ఆదాయం తాగుతుంది మరియు Gifts ఎవరూ కొనరు అంటే ధనవంతుల ఆదాయానికి గండి పడుతుంది.
భారతీయుడు:అది ఎలాగా?
స్వామి:నీ దగ్గర కొంత ఆస్తి ఉంది దాని మీద నీకు రాబడి రావట్లేదు, కానీ నువ్వు ప్రభుత్వానికి క్రమం తప్పకుండా పన్ను చెల్లించాలి చెల్లించను అను కూర్చోవడానికి కుదరదు, ఇదీ అలాగే మనం విదిపోవడంతోనే ధనవంతులకు ఆదాయం.
భారతీయుడు: సరే ఒప్పుకుంటాం, మరి super markets (FDI) లు ఎలా లాభ పడ్డాయి?
వర్తకుడు:స్వామి నేను చెబుతాను నా వృత్తాంతం, వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర కొనడం మొదలు పెట్టారు నా లాంటి వాడి దగ్గర కొనడం మానేశారు, ఇక నాకు గత్యంతరం లేక వాళ్ళు అమ్మిన ధరకు అమ్మడం మొదలు పెట్టాను, నాకు చిల్లి గవ్వ కూడా మిగలలేదు ఇక గత్యంతరం లేక నా దగ్గర ఉన్న సరుకు మొత్తం అమ్మి ఇక్కడకు చేరాను. తరువాత తెలిసినది ఏమిటంటే మాకు సరుకులు దొరకనివ్వలేదు అని.
భారతీయుడు:అది ఎలాగ?
వర్తకుడు:ఇదివరకు సరుకులు పండించి ఊరు దగ్గరలో ఉన్న గిడ్డంగిలలో నిల్వ చేసే వారు.తరువాత ఈ పెట్టుబడులు రావడంతో సరుకులు పంట పండక ముందే కొనేసి పండిన తరువాత తీసుకు వెళ్ళి గిడ్డంగులలో పెట్టేసారు, కనీసం రైతులకు విత్తనాలు కోసం పంట ఉంచ నివ్వలేదు, దాంతో రైతులకు మళ్ళీ విత్తనాలు కొనడానికి వాళ్ళే అప్పు ఇచ్చి తరువాత పంట కూడా కోనేయ్యడం, ఎవడైనా రైతు ఎదురు తిరిగితే వాడి పంట మొత్తం తీసుకుని డబ్బు చేతిలో పెట్టి వెళ్ళి పోయేవారు, వాళ్ళకి విత్తనాలు కొనడానికి డబ్బులు లేక మళ్ళీ పంట వెయ్యలేదు, దీంతో వాళ్ళు నిల్వ చేసుకున్న సరుకుకి గిరాకీ పెరిగి ధరలు పెంచడం మళ్ళీ మొదటికి వచ్చింది రైతు కథ మా కథ కంచికి ఎప్పటికో చేరిపోయింది కదా.
భారతీయుడు:ఆ అవన్నీ అబద్దాలే?
వర్తకుడు: మనకి కనిపించనివి అబద్దాలు కనిపించేవి నిజాలు, నీకు ఉధ్యోగం ఉండటం వలన ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఉధ్యోగం పోయిన వాళ్ళ పరిస్థితి? అంతే కాదు వేల వేల ఎకరాల పంట పొలాలు గిద్డంగులుగా మారాయి, లక్షల ఎకరాలు చేపల చెరువులుగామారాయి.
భారతీయుడు:మంచిదే కదా చేపలు తింటే.
వర్తకుడు:మంచిదే అంటే అర్ధం, ఎవరికీ మధ్యవర్తికా? లేదా తిన్న విదేసీయులుకా?
భారతీయుడు:అందరికీ దొరుకుతున్నాయి కదా.
వర్తకుడు: కాదు డబ్బు పెట్టి కొనగలిగిన వాడికి మాత్రమే, మిగిలిన వారిని Christians క్రింద మార్చి ఆ విదేశీయులు చేసిన తప్పులకు శిక్ష ఇక్కడికి మార్పు చేస్తున్నారు.
స్వామి:మిగిలిన విషయాలు మధ్యాన్నం చర్చించు కుందాం.

స్వామి మళ్ళీ తాన పాప పరిహారం వైపు పయనించాడు, అగమ్యి రామానుజుల దగ్గరకు.
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.