ఆశ్రమం ఎలా కట్టారు?

భారతీయుడు:మంచి చెప్పడానికి సమయం కావాలా?
మనందరి కోసము: అగమ్యి గమ్యం లభించింది(మూడవ భాగం)
అగమ్యి:నా గమ్యం కలపడం అయితే ఎలా ఉన్నా కలుపుతాను!!!!!!!!!!
రామానుజులు:ఇది ఇతను అందరికీ స్నేహితుడు. ఇతను నిన్ను విశ్వనాధు తల్లిదండ్రులకు పరిచయం చేస్తారు.
అగమ్యి:అదేమిటి అతనే చెయ్యవచ్చు కదా! నేను ఎందుకు చెయ్యాలి.
రామానుజులు:నీకు మునుపే చెప్పాను ఇక్కడకు వచ్చిన అందరూ అన్ని పనులు చెయ్యలేరు, వారు చెయ్యాల్సిన పని మాత్రమే చేస్తారు. కొన్ని ప్రదేశాలలో కొందరు ఉండడమే సమంజసం.
అగమ్యి:ఇంతకీ ఈ స్నేహితుడు ఎవరు?
స్నేహితుడు:వ్యాపారి చెప్పాడు కదా అతనే నేను.
అగమ్యి:ఓ మీరా అది, అవును మీరు పెళ్ళి చేసుకోలేదా?
స్నేహితుడు:జీవితంలో కొన్ని సాధించిన తరువాత వచ్చే మొదటి ప్రశ్న ఇదే! సరే అడిగావు కనుక చెప్తాను, మంచి వాడిగా బ్రతికి నందుకు నాకు పడిన శిక్ష, నా భార్య పిల్లలను హతమార్చారు.
అగమ్యి:ఏమి జరిగింది?
స్నేహితుడు:అవసరమా?
అగమ్యి:సరే, మరి సమాజం మీద కోపం రాలేదా?
స్నేహితుడు:రాలేదు, కోపం ద్వేషం పెంచుకోవడానికి సమాజం చేసిన తప్పు ఏమిటి?
అగమ్యి:అలాంటి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చినందుకు.
స్నేహితుడు:కోపం పెంచుకోవడానికి అది కారణం ఎప్పటికీ కాదు.
అగమ్యి:మరి?
స్నేహితుడు:కారణం అతనిని మంచి వాడిగా మార్చలేక పోయినందుకు కోపం రావాలి. కానీ సమాజం ఆశ్రయం ఇచ్చినా దేవుడు ఎప్పటికీ వాళ్ళ పాపాలను లేక్కిస్తాడు, అదే జరిగింది. నా బాధ కేవలం వాళ్ళు మారలేదు, మారి ఉంటే ఎన్నో మంచి పనులు చేసేవారు, మరియు వాళ్ళ అక్రమ సంపాదన బయట పాడేది ఇప్పుడు ఆ ధనం బయటపడలేదు ఎవరికీ ఉపయోగపడని స్థితికి చేరుకుంది.
అగమ్యి:అయితే మీరు చెప్పరు!
స్నేహితుడు:చెప్పను.
అగమ్యి:సరే మీరు ఈ ఆశ్రమం యొక్క శిల్పి మయుడు లాంటి వారు అని అంటున్నారు, అసలు ఎలా కట్టారు?
స్నేహితుడు:నేను మయుడుని కాను, కేవలం మానవ మాత్రుడను,అవసరం గుర్తెరిగి ప్రకృతితో బ్రతకడమే జీవితం.
అగమ్యి:అర్ధం కాలేదు!
స్నేహితుడు:ఈ ఆశ్రమం కొంతవరకూ నేను రాక మునుపు నిర్మాణం జరిగింది, కాకపొతే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అంతే.
మన జీవితంలో మనం అన్నీ విడగోట్టుకున్నాము, అవి కలిపాను ఆశ్రమ నిర్మాణం వేగంగా జరిగింది. పరిశ్రమ అవసరం లేకుండా పోయింది. మనిషే ఒక పరిశ్రమ, అతనిని చూసే యంత్రం తయారు చేసారు. కానీ నేను అతను ప్రకృతితో పనిచేసేలా మార్చాను మార్చుకున్నాము.
అగమ్యి:అంటే?
స్నేహితుడు:సరే వివరిస్తాను, ఈ ఆశ్రమ భోగోళిక స్థితులు చెబుతాను.
మొదటగా మనం ఉండే ప్రదేశం మనకు విశ్రమించుటకు మొదట ప్రదేశం కావాలి, దాని గురించి మొదట్లో నేను రాక మునుపు బయట నుంచీ వెదురు కొని కట్టేవారు, తరువాత ఆ వెదురు పెంచే రైతులు తమ భూమిని ఆశ్రమంలో కలిపి వెదురు పెంచే స్థలం తగ్గించి చెట్లు పెంచడం మొదలు పెట్టారు.
అగమ్యి:ఎందుకు?
స్నేహితుడు:మొదట వారికి అర్ధం అయ్యింది ఈ సృష్టిలో అన్నీ అస్తమాను అవసరం ఉండవు అని, ఇక కొంచం స్థలంలో ఎందుకు పెంచుతున్నారు అనే కదా నీ ప్రశ్న, ఎంత కట్టడమైనా ఎదో ఒకరోజు స్థితి మారుతుంది - అన్నీ ఒకేరోజు స్థితి మారవు కొన్ని కొన్ని రోజులకు స్థితి మారతాయి, కాబట్టి దేన్నీ మనం నాశనం చేసుకోకూడదు.
ఇప్పుడు నీకు ఇంకో ప్రశ్న ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది ఇలా కాకుండా వాటిని నాశనం కాని కట్టడాలు చెయ్యవచ్చు కదా అని, నిజమే చెయ్యవచ్చు కానీ ఒకటి శక్తివంతంగా అవుతుంది అంటే ఇంకొకటి శక్తి కోల్పోతుంది అని అర్ధం.
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.