ఆశ్రమం ఎలా కట్టారు?(రెండవ భాగం)

రామానుజులు:ఇది ఇతను అందరికీ స్నేహితుడు. ఇతను నిన్ను విశ్వనాధు తల్లిదండ్రులకు పరిచయం చేస్తారు.
ఆశ్రమం ఎలా కట్టారు?
 స్నేహితుడు:మొదట వారికి అర్ధం అయ్యింది ఈ సృష్టిలో అన్నీ అస్తమాను అవసరం ఉండవు అని, ఇక కొంచం స్థలంలో ఎందుకు పెంచుతున్నారు అనే కదా నీ ప్రశ్న, ఎంత కట్టడమైనా ఎదో ఒకరోజు స్థితి మారుతుంది - అన్నీ ఒకేరోజు స్థితి మారవు కొన్ని కొన్ని రోజులకు స్థితి మారతాయి, కాబట్టి దేన్నీ మనం నాశనం చేసుకోకూడదు.

ఇప్పుడు నీకు ఇంకో ప్రశ్న ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది ఇలా కాకుండా వాటిని నాశనం కాని కట్టడాలు చెయ్యవచ్చు కదా అని, నిజమే చెయ్యవచ్చు కానీ ఒకటి శక్తివంతంగా అవుతుంది అంటే ఇంకొకటి శక్తి కోల్పోతుంది అని అర్ధం.
అగమ్యి:నాకేమీ ఆ అనుమానం రాలేదు.
స్నేహితుడు:అలవాటు అప్పుడప్పుడు నేను నాకు మూడు ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పడం. సరే ఇక ఈ ఆస్రమా భౌగోళిక స్థితి గతులు చర్చించుకుందాం, ఈ ఆశ్రమం మూడు భాగాలుగా కట్టబడినది.
ఒక భాగం - కేవలం ఆశ్రమం ఉండేది, ఇక్కడ నీకు అన్ని పశుపక్ష్యాదులు మరియు మానవులు ప్రకృతి కలిసి ఉంటారు.
రెండవ భాగం - కొత్తగా ఇక్కడికి చేరే వాళ్ళు.
మూడవ భాగం - ఉపశమనం ప్రశాంతత కోసం వచ్చే వారు. ఈ భాగం కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. వర్షా కాలం మరియు కార్తీక మాసం ఉపయోగించ బడదు,మిగిలిన రోజులలో ఉపయోగిస్తాము.
అగమ్యి:మొదటగా ఇలా మూడు భాగాలు ఎందుకు?
స్నేహితుడు: మొదటి భాగం జీవితం అంటే ప్రకృతి తో ఉండటం అని తెలుసుకున్న వాళ్ళు, రెండు పారిశ్రామిక ఆశ్రమం నుంచీ ప్రకృతి ఆశ్రమంలోకి వచ్చే వారికి, వారి శరీరం యంత్రం కొంచం భిన్న స్థితిలో ఉంటుంది, అది శుధ్ధి చేసిన ఇంధనం మాత్రమే తీసుకోగలదు అది శుధ్ధి ప్రక్రియకు దూరంగా ఉంటుంది. శుధ్ధి ప్రక్రియ అంటే Process కాని ఆహారం జీర్ణం చేసుకోవడం. కొంత మందికి అది రొజులూ ఇంకొంతమందికి నెలలు పట్ట వచ్చు. ఇక మూడవ భాగం వీళ్ళు కేవలం రోగం నయం కావడానికి వచ్చారు. అసలు పరిశ్రమే రోగం అని తెలుసుకోలేరు.
అగమ్యి:అది సరే నేను ఏ భాగంలో ఉన్నాను?
స్నేహితుడు:నువ్వా మొదటి భాగంలోనే ఉన్నావు.
అగమ్యి:అదేమిటి నన్ను ఎలా మొదటి భాగంలోకి చేర్చారు, చేర్చగాలిగారు?
స్నేహితుడు:నీ శరీర తత్త్వం అలాంటిది అది ఏమి తిన్నా జీర్ణం చేసుకోగలదు. నువ్వు ఉన్న మూడు రోజులూ నీ శరీరంలో మార్పులు వచ్చాయా?
అగమ్యి:అది సరే అసలు ఎలా ఇక్కడ స్థానం కల్పించారు?
స్నేహితుడు:శరీర స్థితిని నాడి స్థితి బట్టి ఉంటుంది, నీ నాడీ వ్యవస్థ సమంగా ఉండటం వలన నీకు ఆ స్థానం కల్పించారు.
అగమ్యి:సరే మరి Process ఆహారం గురించి చెప్పగలరు.
స్నేహితుడు: దాని గురించి కేవలం విశ్వనాధు చెప్పగలడు. 
అగమ్యి:ఇంతక్రితం మీరు అన్నారు కదా మనం Engineering విడగొట్టుకుని జీవిస్తున్నాం అని మరి ఇప్పుడు మీరు చెప్పక పోవడం ఏమిటి?
స్నేహితుడు:నేను యంత్రీకరణ చదువుకోలేదు, కేవలం ప్రకృతి జీవితం నేర్చుకున్నాను.
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.