సమాధానం లేని ప్రశ్నలు ఉంటాయా? సమాధానాన్ని అమలు పరిచే వాళ్ళు లేరా?

స్నేహితుడు: నిజమే, అది ఖచ్చితం. అనగనగా భరతుడు రాజ్యాధికారం పొందినప్పుడు ఇద్దరు రైతుల తగువులాట మీద ఒక కథ ఉంది, దానికి భరతుడు చెప్పిన పరిష్కారం నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ స్థితిలో ఉంటే పరిష్కారం పిల్లి పిల్లి తగువులాడుకుంటే కోతి వచ్చి తగువు తీర్చినట్టుంది.
భరతుడు తీర్చాడో లేదో నాకు గుర్తులేదు కానీ నేటి ప్రతీ వ్యక్తీ తీర్చగలడు
స్నేహితుడు: లేని communist లను ఎక్కడ నుంచీ తీసుకు రావాలి?
ఆంధ్రుడు:అంటే అన్ని సంస్థలు ఉన్నాయి అవేవీ కావా?
స్నేహితుడు: కానే కాదు, కుటుంబం ఉంటేనే మనిషి ఆనందంగా ఉండగలడు, వాళ్ళ బాధ అదే వాళ్ళ కుటుంబంలో సాయం చేసే వాళ్ళ కన్నా సాయం ఆశించే వాళ్ళు ఎక్కువ, అందుకు ఉమ్మడి కుటుంబాలను విడగొట్టారు, సాయం చెయ్యడం ఆపించేసారు, శత్రుత్వం పెంచడం లాంటివి చేసార.
ఆంధ్రుడు:అంటే వాళ్ళు చెప్పేవి అన్నీ అబద్దాలే అంటావు, వాళ్ళు అణగదొక్కారు అని చెబుతున్నారు అది నిజం కాదు అంటావు.
స్నేహితుడు: అవునేమో అన్నట్లు మాట్లాడతారు అలా జరిగి ఉండవచ్చు అని మాట్లాడతారు, కొన్ని నిజాలు కొన్ని తమకు అనుకూలంగా రాజ్యాంగం సవరించడానికి ఎన్నుకున్న పంథా.
ఆంధ్రుడు: అంటే వాళ్ళు ఒకప్పుడు రాజులు వాళ్ళను అణగదొక్కి బానిసలు చేసుకోవడం అబద్దం అంటావా?
స్నేహితుడు:చరిత్ర గురించి నాకు అంతగా తెలియదు చరిత్ర ఎవరో ఒకరు వ్రాసింది, వాళ్ళకు తెలిసిన అంశాల నుంచీ, వాళ్ళకు నచ్చిన అంశాలను కలబోసి తయారు చేసింది, చరిత్రలో చాలా శాతం కొంతమందికి తెలిసినదే ఉంటుంది, అందరికీ తెలిసినది ఉండదు. అందరికీ తెలిసినది చరిత్రలో ఉండాల్సిన అవసరం ఉండదు.
ఆంధ్రుడు: మీ లాంటి వాళ్ళు ప్రతీదీ దేవుడు అని అభివృద్ధికి ఆటంకాలు కలిగించారు, పైగా ఈ మితండ వాదం కూడానా!
స్నేహితుడు: నిజమే మా లాంటి వాళ్ళు ఈ ప్రకృతిని దేవుళ్ళు అనుకున్నారు ఆ sudo communist లు ప్రకృతి మనిషి కోసం పనిచెయ్యాలి అని జనాలకు అబద్దాలు చెప్పి అశాస్వతమైన మనిషి కోసం ప్రకృతిని నాశనం చేసారు.
మీకు గతంలో చెప్పాను మేము ప్రకృతి పథం ఎంచుకున్నప్పుడు గిరిజన తండాలకు వెళ్ళాము అని, అక్కడ నాయకులు ఒకటే అన్నారు మా పూర్వీకుల నుంచీ అందరం చెట్లను దేవతలు అని నమ్మాము, కానీ అభ్యుదయ భావాలు అని కొంతమంది మాతో చేరి మా చేతే చెట్లను నరికించి మాకు ఆహారం లేకుండా చేసారు, ప్రతిఘటిస్తే ఆయుధాలకు మేము బలవ్వడం పరిపాటే. ఇక ప్రశ్నిస్తే ముగ్గురి దగ్గర నుంచీ ప్రాణ హాని వాళ్ళు Naxals, అటవీ అధికారులు మూడు వ్యాపారస్తులు.
ఆంధ్రుడు:Naxals అంటే నేను ఒప్పుకోను, మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి?
స్నేహితుడు:ప్రతీ ఒక్కడూ వాళ్ళను గొప్ప వాళ్ళ లాగా చూడటం అలవాటు చేసుకున్నారు.
(సశేషం ...)