వైధ్యుడి భాష వైధ్యుదికే అర్ధం కాదు

స్నేహితుడు: నిర్మింప బడిన శరీరం అయితే ఎందుకు ఆహారం తీసుకుంటున్నావు?
రెండు వ్యతిరేక దిక్కులు ఈ స్థితికి కారణం!
స్నేహితుడు: కొన్ని గ్రంధాలు మనిషి జీవితం సుఖంగా మార్చేవి ఉన్నాయి.
ఆంధ్రుడు:  అంటే మేము చదివేవి మనిషిని కష్టాలలోకి నెట్టుతాయా?
స్నేహితుడు: నిజమే వైధ్యుడి భాష వైధ్యుడికి అర్ధం కాదు, అలాగే ఇది కూడా!
ఆంధ్రుడు: ఏమిటి వైధ్యుడి భాష వైధ్యుడికి ఎందుకు అర్థం కాదు?
స్నేహితుడు: ఒక నిజం చెబుతాను, మా మేనత్త ఒకరు ఉన్నారు ఆమెకు గుండె సమస్య ఉంది, 15 సంవత్సరాల క్రితం గుర్తించారు, అప్పటి నుంచీ ప్రతీ ౧౫ రోజులకు ఒకమారు Injection ఇచ్చేవారు, ఒక ౫ సంవత్సరాలుగా Injection స్థాయి దాటిపోయింది ఇక మీరు కేవలం Tablets వాడటం ఉప్పు మానెయ్యడం చెయ్యాలి అని చెప్పారు. ఎందుకంటే ఉప్పు తింటే గుండె వేగంగా కొట్టుకుంటుంది, గుండె వేగం తగ్గించాలి అంటే ఉప్పు మానెయ్యాలి అన్నారు.కానీ ఇంకో వైధ్యుడు ఉప్పు మానేస్తే ఎలాగా గుండె కొట్టుకోవడం ఆగిపోద్ది అంటాడు, ఎవరిని నమ్మాలి?
ఆంధ్రుడు: వైద్యుడి గురించి అటుంచండి, యోగా చేసే వాళ్ళను ఉప్పు మానెయ్యాలి అనే మీరు దీనిగురించి ఎలా మాట్లాడతారు?
స్నేహితుడు: ఉప్పును తీసుకోవడం మానెయ్యాలి కానీ యోగా చేసే వారు శరీరంలో ఉప్పును తయారు చేసుకుంటారు, వాళ్ళు తినే పచ్చి కూరలలో కావాల్సిన శాతంలో ఉప్పు ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ పరిస్థితి వేరు, గుండె వేగంగా కొట్టుకుంటుంది అని చెప్పి ఉప్పు ఆపించేసారు, మరి ఉప్పు లేకపోతె గుండె కొట్టుకోవడమే మానేస్తుంది కదా, మరి దాని గురించి?
ఆంధ్రుడు: అంటే మీ అభిప్రాయం వైధ్యులకు ఏమీ తెలియదు అనా?
స్నేహితుడు: నిజమో కాదో నాకు తెలియదు కానీ, మన సమాజంలో అందరికన్నా ముందు ఉండాలి అని శ్రమ పడే వాళ్ళు ముందు వెళ్ళడానికి కావలసినవి చూసుకుంటున్నారు కానీ అలా వేగంగా పరిగెట్టడం వలన కోల్పోతున్న విషయాలు గురించి పట్టించుకోరు.
ఆంధ్రుడు: అంటే మేము ముందరి కాళ్ళ బంధం వేసుకుని బ్రతకాలా?
స్నేహితుడు:అలాగా అక్కర్లేదు నువ్వు చేసే పని వల్ల ఇంకొకరు ఏమైనా కోల్పోతున్నారో లేదో తెలుసుకో అంటున్నాను.
ఆంధ్రుడు:అంటే మేము చేసే ప్రతీ పనికి ముందూ వెనకా ఆలోచించకుండా చేస్తున్నాము అనా?
స్నేహితుడు: నిజమే, అది ఖచ్చితం.
(సశేషం....)